Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి ‘ఈ చిన్ని గుండెలో’ సాంగ్ వచ్చేసిందోచ్!

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం నుంచి ‘ఈ చిన్ని గుండెలో’ అనే మెలోడీ పాట విడుదలైంది. మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ 22వ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Andhra King Taluka :  ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి ‘ఈ చిన్ని గుండెలో’ సాంగ్ వచ్చేసిందోచ్!

విధాత, : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా వస్తున్న‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ నుంచి ‘ఈ చిన్ని గుండెలో’ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. మెలోడీ ప్రధానంగా హృద్యమైన సంగీతంతో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సాగింది. సాంగ్ లో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, రామ్ ఎనర్జిటిక్ యాక్షన్, డ్యాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. సాల్మాన్, సత్య యామిని పాడగా, సాహిత్యం కృష్ణకాంత్ అందించారు.

‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లో 22వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. నవంబర్ 28న వరల్డ్ వైడ్‌గా సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈక్రమంలోప్రమోషన్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ను ప్రేక్షకుల ముందుకు తెస్తుంది.

ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు కూడా ఆకట్టుకునే రీతిలో ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది. దీంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై హైప్ పెరిగింది. హీరో రామ్ స్వయంగా రాసిన నువ్వుంటే చాలే పాట కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వివేక్ శివ తో పాటుగా ఉన్న సంగీత దర్శకుడు మెర్విన్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీలో రామ్.. టాప్‌ హీరో ఆంధ్ర కింగ్‌ సూర్యకుమార్‌ అభిమానిగా కనిపించనున్నారు. ఈ మూవీలో రావు రమేష్‌, మురళీశర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేశ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.