The GirlFriend : ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ‘మనసా.. తెలుసా’ విడుదల
నేషనల్ క్రష్ రష్మిక & దీక్షిత్ శెట్టి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి ‘మనసా.. తెలుసా’ పాట రిలీజ్, రొమాంటిక్ మెలోడి హిట్.

విధాత : నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) జంటగా రాహుల్ రవీంద్రన్( Rahul Ravindran) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend) మూవీ నుంచి ‘మనసా.. తెలుసా..ఏం జరుగుతుంది’(Em Jaruguthondi) పాటను మేకర్స్ విడుదల చేశారు. సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా విడుదలైన ఈ పాట హృద్యంగా సాగుతూ ఆకట్టుకుంది. ఈ పాటకు లిరిక్స్‌ను రాకేందు మౌళి రాశారు. చిన్మయి, హేషమ్ అబ్దుల్ అలపించారు.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ బంధాన్ని చాటుతూ సాగిన ఈ పాట సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి తొలుత రిలీజ్ చేసిన నదివే అనే సాంగ్ మంచి ఆదరణ లభించింది. షూటింగ్ తుది దశకు చేరుకున్నది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.