Maruti E-Vitara | మన విటారా కారు.. ఇప్పుడు వంద దేశాలకు పైగా ఎగుమతి !
మారుతీ సుజుకీ ఇ-విటారా కారును భారత్‌లో ఉత్పత్తి చేసి 100కిపైగా దేశాలకు ఎగుమతి ప్రారంభించింది, గ్లోబల్ EV హబ్ కోసం కీలకం.

న్యూఢిల్లీ : భారతీయ వాహన ఉత్పత్తి రంగంలో మారుతీ సుజుకీ విటారా(Maruti Suzuki Vitara) కారుకు వాహన ప్రియుల్లో ఉన్న క్రేజ్ ప్రత్యేకమైంది. తాజాగా ఈ కంపనీ తొలిసారిగా మారుతీ సుజుకీ ఈ-విటారాను ఆవిష్కరించింది. మంగళవారం అహ్మదాబాద్(Ahmedabad) హన్సల్పూర్‌లో మారూతీ సుజుకీ ఫ్లాంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మారుతీ సుజుకీ తొలికారు ఇ-విటారా (E-VITARA)తో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్(State Cheif Minister Bhupendra Patel), జపాన్ రాయబారి కీచీ ఒనొ పాల్గొన్నారు. భారత్‌లో తయారైన ఈ-విటారా తొలి కారును యూకేకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారత్ స్వాలంబన సాధించేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు ఇది ప్రత్యేకమైన రోజు. ఇక్కడ ఉత్పత్తి కానున్న కార్లు యూరఫ్(Europe), జపాన్(Japan) సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి కానున్నాయని వెల్లడించారు. ఇక్కడ తొషిబా(Toshiba ), డెన్సో(Denso), సుజుకీసంస్థల భాగస్వామ్యంతో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారుకానున్నాయి. దాంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది.
భారత్ ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా తీర్చిదిద్దడంతో ఈ-విటారా(E-Viatara) ఎగుమతి కీలక ముందడుగువంటిదని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. మారుతీ సుజుకీ ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో (49kWh, 61kWh) వస్తోంది. 49 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న కారు 144 హెచ్‌పీ శక్తిని, 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61kWh బ్యాటరీ 174 బీహెచ్‌పీని 189 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. అతిపెద్ద బ్యాటరీ వేరియంట్ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రదర్శించిన వీడియోలో పేర్కొంది.