Maruti Suzuki Brezza | ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో బ్రెజా ఆన్‌ రోడ్‌ ధరలు ఇవే..!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజికీ వాహనాలకు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది

Maruti Suzuki Brezza | ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో బ్రెజా ఆన్‌ రోడ్‌ ధరలు ఇవే..!

Maruti Suzuki Brezza | జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజికీ వాహనాలకు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. దేశంలో అత్యధికంగా సెల్లింగ్‌ మోడల్స్‌లో ఎస్‌యూవీ మారుతి బ్రెజా సైతం ఒకటి. తక్కువ ధరలో బెస్ట్‌ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకీ బ్రెజా ఓ మంచి ఆప్షన్‌ అని ఆటోరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీ ఎస్‌యూవీలు హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర ఎంత ఉందో తెలుసుకుందా రండి..!


ఆన్‌ రోడ్‌ ధరలు ఇవే..


బ్రెజా ఎల్​ఎక్స్​ఐ (పెట్రోల్​) రూ. 9,74,862, ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ రూ.10.86 లక్షలు, వీఎక్స్​ఐ (పెట్రోల్​) రూ. 11.32 లక్షలు, వీఎక్స్​ఐ సీఎన్​జీ రూ.12.85 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ (పెట్రోల్​) రూ.13.38 లక్షలు, వీఎక్స్​ఐ ఏటీ (పెట్రోల్​) రూ.13.50 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ డీటీ (పెట్రోల్​) రూ.13.57 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ రూ.14.53 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ డీటీ రూ.14.72 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ (పెట్రోల్​) రూ.15.10 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ ఏటీ (పెట్రోల్​) రూ.15.18 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ డీటీ (పెట్రోల్​)- రూ.15.29 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ ఏటీ డీటీ (పెట్రోల్​)- రూ.15.37 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏటీ (పెట్రోల్​)- రూ.16.90 లక్షలు, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏటీ డీటీ (పెట్రోల్​) రూ.17.09 లక్షలు.


టాప్‌ త్రీలో బ్రెజా..


హైదరాబాద్‌లో ఎస్‌యూవీ మారుతి సుజుకీ బ్రెజా ఆన్‌ రోడ్‌ ధర రూ.9.78లక్ష నుంచి రూ.17.09లక్షల మధ్య ఉన్నది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన పది ఎస్‌యూవీల్లో బ్రెజా మూడోస్థానంల ఉన్నది. జనవరిలో.. 15,303 బ్రెజా యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 7శాతం ఎక్కువ. ఇదే జాబితాలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్‌, టాటా నెక్సాన్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.