Renu Desai| ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం వేళ రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర పోస్ట్.. ఫ్యాన్స్ హ్యాపీ

Renu Desai| ఈ సారి ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌న్ సైడ్ కావ‌డం మ‌నం చూశాం. ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు కైవసం చేసుకోగా, జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21కి 21 ఎమ్మెల్యేలు, 2 కి 2 రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఈ రోజు గన్నవరం ఐటీ పార్క్ స

  • By: sn    cinema    Jun 12, 2024 3:26 PM IST
Renu Desai| ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం వేళ రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర పోస్ట్.. ఫ్యాన్స్ హ్యాపీ

Renu Desai| ఈ సారి ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌న్ సైడ్ కావ‌డం మ‌నం చూశాం. ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు కైవసం చేసుకోగా, జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21కి 21 ఎమ్మెల్యేలు, 2 కి 2 రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఈ రోజు గన్నవరం ఐటీ పార్క్ సమీపంలో ఉదయం 11.27 గంటలకు నాలుగోసారి సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మోణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇదే కార్య‌క్ర‌మంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ తో స‌హ మ‌రో 23మంది మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలు పీఎం మోడీ, అమిత్ షా హాజరయ్యారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తుండ‌డంతో మెగా ఫ్యామిలీ అంతా బ‌స్సులో స‌భా స్థలికి చేరుకున్నారు.

నాగ‌బాబు, సురేఖ‌, వైష్ణ‌వ్ తేజ్, చిరంజీవి, సాయి ధ‌ర‌మ్ తేజ్, శ్రీజ ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఒకే బ‌స్సులో అక్క‌డికి వ‌చ్చారు. ఇక ప‌వ‌న్ పిల్ల‌లు అకీరా, ఆద్య కూడా ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంలో కార్యక్రమానికి ముందు తన పిల్లలు అకీరా, ఆద్యలతో మాట్లాడాడట. నాన్న బిగ్ డే నాడు అకీరా, ఆద్య ఇలా తయారై వీడియో కాల్ మాట్లాడారని మాజీ వైఫ్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అకీరా,ఆద్యల ఫోటోలు షేర్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెష్ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయాలన్న ఆయన లక్ష్యం నెరవేరాలని కోరుకోగా, ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ప‌వన్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల‌లో గెలిచిన‌ప్ప‌టి నుండి ఆయ‌న త‌నయుడు అకీరాతో ఎక్కువ‌గా క‌నిపించాడు. అలా ప‌వ‌న్, అకీరాకి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌యంలో రేణూ దేశాయ్ ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెట్టింట సంద‌డి చేస్తూ ఉంటుంది. గతంలో రేణు దేశాయ్ తన పిల్లలకు పవన్ కళ్యాణ్ తండ్రి అంటే ఒప్పుకునేది కాదు. అకీరా, ఆద్య కేవలం నా పిల్లలు మాత్రమే అనేది. ఇప్పుడు నాన్న అంటూ ఆమె స్వయంగా కామెంట్ చేయడం చర్చకు దారి తీస్తుంది.