Prabhas|ప్రభాస్ గురించి గొప్పగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఆర్జీవి నా ఫ్రెండ్ అంటూ కామెంట్
Prabhas| గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో ముఖ్య

Prabhas| గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ సమాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. కష్టపడే గుణం ఉండడం వల్లనే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ గురించి కూడా రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ లేకుండా బాహుబలి చిత్రం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రభాస్ విశ్వవ్యాప్తం చేశారని కామెంట్ చేశారు.
ఇక రామ్ గోపాల్ వర్మ తనకి మంచి మిత్రుడు అని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమని ఆయన అన్నారు. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు.. నా కన్నా గొప్ప వాళ్లు స్టేజి ముందు వినయంగా కూర్చొన్నారని, అదీ క్షత్రియుల గొప్పతనం అన్నారు. కొంపల్లిని పెద్ద నగరంగా చేసింది క్షత్రియులే అన్నారు. మరోవైపు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ అని అన్నారు. ఆయన మాటిస్తే తప్పకుండా నిలబడతారని క్షత్రియ సమాజానికి తెలిపారు.
ఇక కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంలో.. బోసురాజు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు మీడియాలో కూడా రాజులే రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో అడుగు పెట్టినా.. వారికి ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వంతో రాణిస్తారని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రభాస్ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈ క్లిప్‌ని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.