Miss Universe India Rhea Singha | మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2024గా గుజరాత్‌ బ్యూటీ రియా సింఘా..!

Miss Universe India Rhea Singha | మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 (Miss Universe India Rhea Singha 2024) కిరీటాన్ని గుజరాత్‌ (Gujarat) బ్యూటీ రియా సింఘా (Rhea Singha) సొంతం చేసుకున్నది. రాజస్థా్‌న్‌లోని జైపూర్‌ వేదికగా జరిగిన పోటీల్లో 51 మంది సుందరీమణులు కిరీటం కోసం పోటీపడ్డారు. చివరకు రియా సింఘా కిరీటాన్ని ఎగరేసుకొని పోయింది.

  • By: Mallanna |    cinema |    Published on : Sep 23, 2024 11:47 AM IST
Miss Universe India Rhea Singha | మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2024గా గుజరాత్‌ బ్యూటీ రియా సింఘా..!

Miss Universe India Rhea Singha | మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 (Miss Universe India Rhea Singha 2024) కిరీటాన్ని గుజరాత్‌ (Gujarat) బ్యూటీ రియా సింఘా (Rhea Singha) సొంతం చేసుకున్నది. రాజస్థా్‌న్‌లోని జైపూర్‌ వేదికగా జరిగిన పోటీల్లో 51 మంది సుందరీమణులు కిరీటం కోసం పోటీపడ్డారు. చివరకు రియా సింఘా కిరీటాన్ని ఎగరేసుకొని పోయింది. 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఊర్వశీ రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనంతరం విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ప్రతిష్టాత్మక రియా సింఘా మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొననున్నది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రియా గురించి తెగ వెతుకుతున్నారు. 19 సంవత్సరాల రియా సింఘా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు.

ఈ స్టోర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌, వ్యవస్థాపకుడైన బ్రిజేష్‌ సింఘా, రిటా దంపతుల కూతురే రియా సింఘా. బీఎల్‌ఎస్‌ యూనివరిటీలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చదువుతున్నారు. రియా 16 సంవత్సరాలు వయసులో మోడలింగ్‌ ప్రారంభించింది. 2020లో దివాస్‌ మిస్‌ టీన్‌ గుజరాత్‌ టైటిల్‌ని నెగ్గింది. 2023 ఫిబ్రవరి 28న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2023లో రియా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 26 మందితో పోటీపడి టాప్‌-6లో నిలిచింది. 2023 ఏప్రిల్ 19న ముంబయి వేదికగా జరిగిన టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో రియా సింఘా పాల్గొన్నది. 19 మందితో పోటీపడి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆదివారం (సెప్టెంబర్‌ 22న) జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో కిరీటాన్ని సొంతం చేసుకున్నది. రియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. ఇస్టాలో ఆమెకు 43వేల మందికిపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.