Kantara Chapter 1 | కలెక్షన్స్ కు హైప్.. ‘కాంతార చాప్టర్‌ 1’ సెకండ్ ట్రైలర్

రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1' (ప్రీక్వెల్) 12 రోజుల్లో ₹675 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ దీపావళి సందర్భంగా, కలెక్షన్స్ హైప్ కోసం మేకర్స్ తాజాగా సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Kantara Chapter 1 | కలెక్షన్స్ కు హైప్.. ‘కాంతార చాప్టర్‌ 1’ సెకండ్ ట్రైలర్

విధాత : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా నటించిన ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా అక్టోబరు 2న విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతుంది. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా 12రోజుల్లోనే రూ.675 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం రేపింది. బాహుబలి: ది బిగినింగ్ (రూ.650 కోట్లు) రికార్డును అధిగమించింది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీ (రూ.628 కోట్లు) కలెక్షన్లను కూడా దాటేసి, కొత్త మైలురాయిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 20 చిత్రాల జాబితాలో కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం 17వ స్థానానికి చేరింది. అలాగే 2025లో ఇప్పటివరకు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కాంతారా చాప్టర్ 1 రెండో స్థానంలో నిలిచింది. రూ.808 కోట్ల గ్రాస్‌తో ఛావా మొదటి స్థానంలో కొనసాగుతోంది. తెలుగులో రజనీకాంత్‌, యష్‌ తర్వాత రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన మూడో పరభాషా హీరోగా రిషబ్ శెట్టి రికార్డు సాధించారు.

కాంతారా చాప్టర్ 1 సినిమా నుంచి మేకర్స్ తాజాగా దీపావళిని పురస్కరించుకుని కొత్త ట్రైలర్‌ ను గురువారం విడుదల చేశారు. సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో రూపొందించిన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కాంతారా అడవి దృశ్యాలు, పోరాట సన్నివేశాలు గుస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పటికే ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లను మరింత పెంచేందుకు అవసరమైన హైప్ ను కొత్త ట్రైలర్ క్రియేట్ చేసేదిగా ఉంది. పంజర్లి దేవుడి నేపథ్యంలో రూపొందిన పిరియాడికల్ చిత్రానికి ప్రేక్షకులు ఇంకా బ్రహ్మరథం పడుతుండటంతో మరిన్ని కలెక్షన్ల దిశగా సినిమా దూసుకపోతుంది.