Rukmini Vasanth : వరుస సినిమాలతో రుక్మిణి వసంత్ బిజీ
కన్నడ భామ రుక్మిణి వసంత్ 'మదరాశి', 'కాంతార ఛాప్టర్ 1', 'యష్ ట్యాక్సిక్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది, భారీ సినిమాల జాబితాలో ఉంది.
విధాత : కన్నడ భామ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) గాలి వీస్తుంది. “సప్తసాగరాలు దాటి’(Saptasagaralu Dati) సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఆ సినిమా తర్వాత ఎంత పెద్ద సినిమాలు చేసినా తనకు మాత్రం ఎప్పటికి ఆ సినిమా వెరీ స్పెషల్ అంటుంది. 2019లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన రుక్మిణి వసంత్ కు సినీ కేరీర్ కు మైలురాయిగా నిలిచింది. తాజాగా శివ కార్తికేయన్-మురుగదాస్ కాంబోలో వచ్చిన ‘మదరాశి’లో(Madarasi) రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో మాట్లాడిన నిర్మాత ఎన్వీ ప్రసాద్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్(NTR-Prahanth Neel) సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని వెల్లడించారు. అలానే కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1), యష్ ‘ట్యాక్సిక్'(Toxic) లోనూ ఈమెనే కథానాయిక అని చెప్పుకొచ్చారు. ఇలా ప్రముఖ హీరోల సరసన భారీ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినా రుక్మిణి వసంత్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ దీ ఇండస్ట్రీగా మారిపోయింది. ప్రస్తుతం రుక్మిణి సినిమాల జాబితా చూస్తూ మిగతా హీరోయిన్లు బేజారవ్వక మానరు.
కాంతారా ఛాప్టర్ 1 మూవీలో ఈ భామ యువరాణి పాత్రతో ఆకట్టుకోబోతుంది. వచ్చే ఏడాది మార్చిలో ట్యాక్సిక్, వేసవిలో నీల్-తారక్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇవన్నీ కూడా భారీ క్రేజీ సినిమాలుగా ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఆ సినిమాలు హిట్ అయితే రుక్మిణి వసంత్(Rukmini Vasanth) కూడా సాటి కన్నడ(Kannada) భామ స్టార్ హీరోయిన్ రష్మిక మందనా బాటలో సాగిపోతుందంటున్నారు విశ్లేషకులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram