Salman Khan Plans To Become A Father | సల్మాన్ ఖాన్ నోట పెళ్లి..పిల్లల మాట!

సల్మాన్‌ ఖాన్‌ భవిష్యత్‌లో పిల్లలు కావాలని స్పష్టం. పెళ్లి, పిల్లలపై టాక్ షోలో ఆసక్తికర సమాధానాలు ఇచ్చి అభిమానుల్లో హల్‌చల్.

salman-khan-speaks-about-marriage-and-kids-on-two-much-with-twinkle-and-kajol-show

విధాత : బాలీవుడు అవివాహిత హీరో సల్మాన్ ఖాన్ కు ఎట్టకేలకు పెళ్లి..పిల్లలపై మనసు మళ్లింది. 60ఏళ్ల అవివాహితుడైన సల్మాన్ ఖాన్ తనకు పిల్లలు కావాలంటూ మనసులోని మాట చెప్పేసుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ షోలో గురువారం నుంచి ప్రసారం కాబోతున్న ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్ ట్వింకిల్‌’ టాక్‌ షోలో ఆమీర్‌ఖాన్‌తో కలిసి సల్మాన్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా కాజోల్, ట్వింకిల్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. షోలో ట్వింకిల్‌ మాట్లాడుతూ సల్మాన్‌ గతంలో ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో తనని తాను ‘నవ మన్మథుడు’గా చెప్పుకున్నాడని.. అయితే, ఆయనకు డజను మంది పిల్లలు ఉండి ఉండవచ్చు అని..కానీ వాళ్ల గురించి మనకు తెలియదు..ఆ విషయం నీక్కూడా (సల్మాన్‌) తెలిసే అవకాశం లేదులే’ అంటూ జోక్ పేల్చింది. స్పందించిన సల్మాన్‌ ‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా. .ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్లను మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా’ అని సమాధానమిచ్చారు.

కచ్చితంగా ఒక బిడ్డ ఉంటుంది..

పిల్లలను దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? అని ట్వింకిల్ అడగ్గా, అసలు అలాంటి ఆలోచనే లేదంటూ పరోక్షంగా పెళ్లి ఆలోచనను బయటపెట్టారు. భవిష్యత్‌లో తప్పకుండా తనకు పిల్లలు కావాలని స్పష్టం చేశారు. అందుకు సమయం ఉందా? అని ట్వింకిల్‌ ప్రశ్నించగా, ఎప్పుడైనా జరగొచ్చు..కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుందని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా! దేవుడి దయ అంటూ సల్మాన్‌ చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోమని తన తల్లిదండ్రులు సలీమ్‌ఖాన్‌, సల్మాఖాన్‌లు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని సల్మాన్‌ తెలిపాడు. తనకు పిల్లలు పుడితే, తన కుటుంబం వారి ఆలనా పాలనా చూసుకుంటుందన్నాడు. అలీజ్‌ (సల్మాన్‌ మేనకోడలు), అయాన్‌ (మేనల్లుడు)లు కూడా పెద్ద వారయ్యారని, అంతా వాళ్లే చూసుకుంటారంటూ తెలిపారు.