Aamani | టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఆమని ఒకరు. ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పాల్సిన పని లేదు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనతో పాటు అందం కూడా ఉండటంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.
Aamani | టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఆమని ఒకరు. ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పాల్సిన పని లేదు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనతో పాటు అందం కూడా ఉండటంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. కెరియర్లో అగ్రహీరోలందరితో నటించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త పాత్ర పోషిస్తూ బిజీ అయ్యారు. వాస్తవానికి ఎన్నో సినిమాల్లో భార్య పాత్రల్లో అద్భుత నటనను కనబరిచారు. అయితే, ఆమె రియల్ లైఫ్‌లో వైవాహిక బంధం మాత్రం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది.
ఆమని చాలా ఆలస్యంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్ని వివాహం చేసుకున్నారు. చాలామంది వీరిది ప్రేమ వివాహం అనుకున్నారు. కానీ. ఆ పెళ్లి పెద్దలు కుదిర్చిన కూడా కాదు.. ఇద్దరు కలుసుకున్నాక అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఆమని దంపతులకు ఓ కొడుకు, కూతురు సైతం ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. భర్తకు సినిమాలు ఇష్టం లేకపోవడంతో దూరంగా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చారు. భర్త అప్పులపాలు కావడంతో మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడానికి అదే కారణం కూడా అదేనంటూ ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని ఆమె తెలిపింది. తాజాగా తన భర్తతో విడిపోవడానికి కారణాలు చెప్పింది.
అప్పులు తీరాయని.. ఆ సమస్య లేదని స్పష్టం చేసింది. తనకు సినిమాలంటే ఇష్టమని, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని తెలిపింది. దాంతో ఒకరికొకరం సమయం ఇచ్చుకోవడం కష్టమని భావించి.. ఓ నిర్ణయానికి వచ్చి విడిపోయినట్లు తెలిపింది. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకొని విడిపోయినట్లు చెప్పింది. విడిపోయినా ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నామని, అప్పుడప్పడు కలుస్తుంటామని చెప్పింది. పిల్లల బాధ్యత నేనే తీసుకుని వారే తన ప్రపంచంలా బతుకుతున్నట్లు పేర్కొంది. సినిమాలతో వారి పేరెంటింగ్ కాస్త ఇబ్బంది అవుతుందని, కానీ మ్యానేజ్ చేస్తూ వస్తున్నానని వివరించారు. ఆమని ప్రస్తుతం సినిమాలతో పాటు సీనియల్స్లోనూ నటిస్తున్నారు.