Prabhas| ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడోచ్.. అమ్మాయి ఎవరంటే..!
Prabhas| టాలీవుడ్ స్టార్ హీరోలు అందరు పెళ్లి పీటలెక్కారు. కాని ఒక్క ప్రభాస్ మాత్రం బ్యాచిలర్‌గానే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పెళ్లి ఎప్పడు అనే దాని గురించి నెట్టింట చర్చ నడుస్తూనే ఉంటుంది. గత ఏడాది అతను బంధువుల అమ్మాయిని వివాహం చేసుకుంటాడని ప్రచారం జరిగింది. కాని అది జరగలేదు.అస

Prabhas| టాలీవుడ్ స్టార్ హీరోలు అందరు పెళ్లి పీటలెక్కారు. కాని ఒక్క ప్రభాస్ మాత్రం బ్యాచిలర్‌గానే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పెళ్లి ఎప్పడు అనే దాని గురించి నెట్టింట చర్చ నడుస్తూనే ఉంటుంది. గత ఏడాది అతను బంధువుల అమ్మాయిని వివాహం చేసుకుంటాడని ప్రచారం జరిగింది. కాని అది జరగలేదు.అసలు ప్రభాస్ పెళ్లి చేసుకోడని కొందరు కామెంట్ చేశారు. దీంతో ప్రభాస్ పెళ్లి విషయంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాత్రం తన కొడుకు పెళ్లి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పైనుంచి కృష్ణంరాజు అంతా చూసుకుంటారని ఆమె స్పష్టం చేశారు.
కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ పై మాట్లాడిన శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి కూడా మాట్లాడారు. ప్రభాస్ కు సక్సెస్ రాదని గతంలో కొందరు అన్నారని, కానీ కల్కి 2898 ఏడీ రూపంలో వచ్చిందని, అలాగే అతని పెళ్లి కూడా జరుగుతుందని ఆమె చెప్పడం గమనార్హం. కాగా, ప్రభాస్ మహర్దశ బాహుబలితోనే ముగిసిందని, ఇక అతను సక్సెస్ చూడలేడంటూ సెలబ్రిటీల జ్యోతిష్యుడు గతంలో కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దానిపై శ్యామలా దేవి ఈ విధంగా స్పందించారు. ‘‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కు విజయాలు దక్కవని కొందరు చెప్పుకురాగా, ఇప్పుడు వారి అంచనాలు తారుమారు అయ్యాయి. మంచితనం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇదే ప్రూఫ్.
ప్రభాస్ తన అభిమానుల కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. ప్రత్యేక దృష్టి మరీ పని చేస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ విషయంలో అన్నీ ఆశించినట్టే జరిగాయి. పెళ్లి కూడా సమయం వచ్చినప్పుడు తప్పక జరుగుతుందని శ్యామలా దేవి చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం . త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకోనుందంటూ విశ్లేషిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ రూపంలో రెండు వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్ త్వరలో స్పిరిట్, రాజాసాబ్, కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2 చిత్రాలతో పలకరించనున్నాడు.