జాన్వీ హంగామా.. ఆకట్టుకుంటున్న‘పరమ్ సుందరి’ ట్రైలర్
లీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, అందాల తార జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘పరమ్ సుందరి’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్‌ల మధ్య జరిగిన ప్రేమ

విధాత: బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, అందాల తార జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘పరమ్ సుందరి’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్‌ల మధ్య జరిగిన ప్రేమ..పెళ్లి నేపథ్యం కథతో నిర్మితమైన ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మంగళవారం విడుదలైన ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలతో..అందమైన లోకేషన్లలో రూపుదిద్దుకున్న పాటలతో సాగుతూ ఆకట్టుకుంది. సినిమాలో జాన్వీకపూర్ తన గ్లామర్ తో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషించినట్లుగా కనిపిస్తుంది. ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో రజనీకాంత్, మోహన్‌లాల్, అల్లు అర్జున్‌లాంటి వారిని ఇమిటేట్ చేసి జాన్వీ ప్రేక్షకులను నవ్వించింది. ట్రైలర్ లో ఎక్కువగా జాన్వీ హంగామానే కనిపించడం చూస్తే సినిమాలో ఆమె పాత్ర చుట్టూనే కథ సాగుతున్నట్లుగా ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాక విడుదలైన పాటలతో పాటు ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటం సినిమా సక్సెస్ పై అంచనాలను పెంచేసింది.
‘పరమ్ సుందరి’ ట్రైలర్