Sitara| మంజుల చేసిన ప‌నికి కోపంతో ఊగిపోయిన మ‌హేష్‌.. ఎందుక‌లా చేశాడో వివ‌రించిన సితార‌

Sitara|  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అందాల తార నమ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార సినిమాల‌లోకి రాక‌పోయిన ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారి చిన్న‌ప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. త‌న ఇన్‌స్టా ద్వారా చిన్నారులకు అవసరమైన విషయాలను చెప్ప‌డం లేదంటే డ్యాన్స్ రీల్స్ చేస్తూ

  • By: sn    cinema    May 24, 2024 8:39 PM IST
Sitara| మంజుల చేసిన ప‌నికి కోపంతో ఊగిపోయిన మ‌హేష్‌.. ఎందుక‌లా చేశాడో వివ‌రించిన సితార‌

Sitara|  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అందాల తార నమ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార సినిమాల‌లోకి రాక‌పోయిన ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారి చిన్న‌ప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. త‌న ఇన్‌స్టా ద్వారా చిన్నారులకు అవసరమైన విషయాలను చెప్ప‌డం లేదంటే డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానుల‌కి దగ్గ‌రైంది. ఎక్కువ మ‌హేష్ బాబు సాంగ్స్‌కి స్టెప్పులు వేస్తూ అల‌రిస్తుంది సితార‌. రోజు రోజుకి సితార ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుందే త‌ప్ప త‌గ్గడం లేదు.ఆ మ‌ధ్య ఇంటర్నేషనల్ ఆభరణాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.

ఇక తాజాగా సితార సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆస‌క్తిక‌ర సమాధానాలు ఇచ్చింది. మీ తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలలో ఏ పాత్ర చేయాలని మీరు అనుకుంటారు అంటూ ప్రశ్నించగా.. ఖలేజా సినిమాలో సీతారామరాజు పాత్ర పాత్ర చేయాలని ఉంది అంటూ సితార చెప్పుకొచ్చింది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని సితారని అడగగా తన పేరెంట్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు బాగా స్ట్రిక్ట్ అని అడిగితే ఎవరు కాదని ఇద్దరు తనతో సరదాగా ఉంటారు అంటూ సితార ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది.

అమ్మ, నాన్న, అన్న నుంచి ఏదైనా నేర్చుకోవాలి అంటే.. తల్లి నమ్రత దగ్గరనుంచి ఫ్యాషన్ సెన్స్, తండ్రి మహేష్ నుంచి యాక్టింగ్, అన్న నుంచి ఓపిక నేర్చుకుంటానని చెప్పుకొచ్చింది. కొత్తగా వచ్చే యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ భ‌య‌ప‌డ‌కుండా త‌మ‌కు న‌చ్చిన‌ట్లు మాట్లాడంటూ స‌ల‌హా ఇచ్చింది. ఇక ఇటీవ‌ల మహేష్- మంజుల మధ్య జరిగిన క్యూట్ ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా సితార చెప్పుకొచ్చింది. మహేష్ హెయిర్ ను మంజుల ముట్టుకోగానే ఆయ‌న‌ ఫైర్ అయ్యాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో సీతూ పాప తెలిపింది. నాన్న హెయిర్ ను అత్త పట్టుకోగానే.. డోంట్ టచ్ మై హెయిర్ అన్నారని, ఆయనకు తన హెయిర్ ను ఎవరు పట్టుకున్నా ఇష్టం ఉండ‌ద‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ తో నిర్వహించిన చిట్ చాట్ లో సితార మాట్లాడిన క్యూట్ మాట‌లు అంద‌రికి తెగ న‌చ్చేశాయి