Sitara|స్కూల్‌కి తెగ బంక్ కొడుతున్న సితార.. అతని వల్లే అంటూ షాకింగ్ విషయం వెల్లడి
Sitara| మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.చిన్న వయస్సులోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సితార స్టార్ కిడ్‌గా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఆ మధ్య జ్యువెలరీ యాడ్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సొంతంగా యూట్యూబ్ ఛా

Sitara| మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.చిన్న వయస్సులోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సితార స్టార్ కిడ్‌గా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఆ మధ్య జ్యువెలరీ యాడ్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని రన్ చేస్తూ మరోవైపు ఫ్రెండ్స్ తో కలిసి గేమ్స్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. చిన్న వయస్సులోనే సితార ఈ రేంజ్ పాపులారిటీ దక్కించుకోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు.
సితార పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార స్కూల్‌కి బాగానే బంక్ కొడుతున్నట్టు తెలియజేసింది. అందుకు కారణం తన తండ్రి మహేష్ బాబు అని తెలియజేసింది. చాలా సార్లు డాడీ వల్లే బంక్ కొట్టాల్సి వచ్చిందని చెప్పి ఆశ్చర్యపరిచింది. సితార అంటే మహేష్ కి చాలా ఇష్టం.మహేష్ బాబుకి సినిమాల షూటింగ్‌లో గ్యాప్ దొరికితే విదేశాలకు వెళ్లిపోతాడు. వెకేషన్‌కి వెళ్తుంటారు. బహుశా ఈ కారణాలతో స్కూల్‌కి బంక్ కొట్టాల్సి వస్తుందేమో, లేక తనతో ఆడుకోవాల్సి రావడం వల్ల ఇలా చేయాల్సి వస్తుందేమో అని అందరు ఆలోచిస్తున్నారు. ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.
గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితార తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సితార మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ నే తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్ళ కోర్స్ చేస్తున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితార చెప్పుకొచ్చింది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం.. రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. గరుడు అనే టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు అర్ధమవుతుంది.