Sobhita Dhulipala | అక్కినేని ఫ్యామిలీకి షాక్.. బాలీవుడ్ మూవీలో ఐటెమ్ సాంగ్ చేయబోతున్న శోభిత ?
Sobhita Dhulipala | యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారని తెగ ప్రచారం జరిగినా ఏమాత్రం బయట పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరిగింది.

Sobhita Dhulipala | యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారని తెగ ప్రచారం జరిగినా ఏమాత్రం బయట పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 8న ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వాస్తవానికి 2021 అక్టోబర్ 2న నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. డివోర్స్ అనంతరం సమంత కెరియర్‌పై దృష్టి సారించింది. ఇక నాగచైతన్య మాత్రం ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు శోభితతో రిలేషన్ కొనసాగిస్తూ వచ్చాడు.
ఇదిలా ఉండగా.. శోభితకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ మూవీలో శోభిత ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. బాలీవుడ్‌లో డాన్ సిరీస్‌లో డాన్-3 మూవీ రాబోతున్నది. డాన్ సిరీస్‌లో తొలి రెండు భాగాల్లో షారుఖ్ ఖాన్ నటించాడు. మూడో సిరీస్‌లో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు. డాన్-3లో ఓ ఐటెమ్ సాంగ్‌ను శోభిత చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఇది అక్కినేని ఫ్యామిలీకి షాకింగ్ న్యూస్ అని పలువురు పేర్కొంటున్నారు. గతంలో సమంత ఐటమ్ సాంగ్ చేసిందనే కారణంతోనే విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియరాలేదు. తాజాగా శోభిత వ్యవహారంలో అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. శోభిత ఐటెమ్ సాంగ్ చేస్తుందా? ఇదంతా వట్టి ప్రచారమేనా వేచి చూడాల్సిందే.