Sardar 2 | కార్తీ సర్ధార్2 సెట్‌లో విషాదం.. 20 అడుగుల ఎత్తు నుండి పడి స్టంట్‌మెన్ మృతి
Sarda2| ఈ మధ్య కాలంలో సెట్స్‌లో హీరోలు గాయపడడం, పలువురు మృతి చెందడం మనం బాగా వింటున్నాం. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇం

Sardar 2 | ఈ మధ్య కాలంలో సెట్స్‌లో హీరోలు గాయపడడం, పలువురు మృతి చెందడం మనం బాగా వింటున్నాం. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ చిత్రీకరణ సమయంలో పెద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి సంఘటన సర్ధార్ 2 సెట్స్‌లో జరిగింది. స్టంట్‌మెన్ 20 అడుగుల ఎత్తు నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందుతున్నారు. కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లతో పాటు మంచి విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు.
జూన్ రెండో వారంలో పూజతో లాంఛనంగా ‘సర్దార్ 2 చిత్రం ప్రారంభం కాగా, సోమవారం (జూలై 15న) చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.అప్పుడు ఆ సెట్‌లో ప్రమాదవశాత్తూ ఒక స్టంట్ మ్యాన్ మృతి చెందారు. ఎళుమలై అనే స్టంట్ మ్యాన్ 20 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ‘సర్దార్ 2’ చిత్రీకరణలో జరిగిన ప్రమాదం మీద చెన్నైలోని విరుగంబాక్కమ్ స్టేషన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంతో స్టంట్ సీక్వెన్సులు తీసే సమయంలో మూవీ యూనిట్స్ తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ మీద జోరుగా చర్చ నడుస్తుంది. ఇక 2022లో ‘సర్దార్’ తొలిభాగం రాగా, ఇందులో కార్తీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు.
ఇప్పుడు రెండో భాగాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. తొలి భాగంలో నటించిన నటీనటులే రెండో భాగంలోనూ నటించనున్నారు. అయితే, తొలి భాగానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా, రెండో భాగానికి మాత్రం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. సర్ధార్ 2 చిత్రం కూడా బడా హిట్ కొడుతుందని అందరు భావిస్తున్నారు.