John Cena | హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన స్టార్ రెజ్ల‌ర్.. వెల్‌క‌మ్ మాములుగా లేదుగా!

John Cena | విధాత: ఇప్పుడు హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ హీట్ పీక్స్‌లో ఉంద‌ని చెప్పాలి. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ మన దేశానికి రావడంతో ప్ర‌తి ఒక్క‌రు దీనిని లైవ్‌లో చూసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షో జ‌రుగుతుండ‌గా, ఇది చూసేందుకు రెజ్లింగ్ అభిమానులు చాలా ఉత్సుక‌త‌తో ఉన్నారు. ఇక ఈ ఈ షో కోసం స్టార్ రెజ్ల‌ర్ జాన్ సీనా గ‌త రాత్రి హైద‌రాబాద్ […]

  • By: sn    latest    Sep 09, 2023 1:37 AM IST
John Cena | హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన స్టార్ రెజ్ల‌ర్.. వెల్‌క‌మ్ మాములుగా లేదుగా!

John Cena |

విధాత: ఇప్పుడు హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ హీట్ పీక్స్‌లో ఉంద‌ని చెప్పాలి. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ మన దేశానికి రావడంతో ప్ర‌తి ఒక్క‌రు దీనిని లైవ్‌లో చూసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షో జ‌రుగుతుండ‌గా, ఇది చూసేందుకు రెజ్లింగ్ అభిమానులు చాలా ఉత్సుక‌త‌తో ఉన్నారు.

ఇక ఈ ఈ షో కోసం స్టార్ రెజ్ల‌ర్ జాన్ సీనా గ‌త రాత్రి హైద‌రాబాద్ చేరుకున్నారు. అత‌నిని చూసేందుకు అభిమానులు బారులు తీరారు. తెల్ల టీషర్ట్, బ్లాక్ షార్ట్స్, క్యాప్‌తో వచ్చిన జాన్ సీనాకు అభిమానుల నుండి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ జాన్ విమానాశ్ర‌యం నుండి హోట‌ల్‌కి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న మెడ‌లో బంతిపూల దండ వేసి ఆహ్వానం ప‌లికారు.