Chiranjeevi – Mohanbabu | చిరంజీవి, మోహన్‌బాబు.. వీళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలా ఉంటారని అంటుంటారు దగ్గరి మిత్రులు. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నా, ఇద్దరి మధ్య స్నేహం మాత్రం గాఢంగానే ఉంటుందని మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి చాలాసార్లు చెప్పింది. ఈ ఇద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారన్న సంగతి తెలుగు సినీ అభిమానులకు బాగా తెలుసు. ఇద్దరూ హీరోలుగా, చిరంజీవి హీరో – మోహన్‌బాబు విలన్‌గా నటించిన సినిమాలు ఎన్నో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి సినిమా కొదమ సింహం. 1990 ఆగస్టులో విడుదలైంది. అంటే సరిగ్గా 35 సంవత్సరాలు. మూడున్నర దశాబ్దాల తర్వాత వీళ్లిద్దరినీ కలిపే చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్టయింది. ఆ సాహసం చేస్తున్న నిర్మాత, హీరో మరెవరో కాదు, నాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ‘ది ప్యారడైజ్‘.
ఇప్పుడు నాని–శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చుట్టూ టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్న బజ్ ఒక్కటే—మోహన్‌బాబు విలన్, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్ర. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, మంచు లక్ష్మి ‘డాడ్ న్యూ లుక్, రిగరస్ వర్కౌట్స్’ అని లీక్ ఇవ్వడం, అదే సమయంలో మరోవైపు చిరంజీవి క్యామియో టాక్ నలుచెరగులా వ్యాపించడం — all together, దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే సినిమాలో కనిపించే అవకాశాన్ని అభిమానులు సెలబ్రేట్ చేస్తున్నారు. హాలీవుడ్ లెవల్లో మార్కెటింగ్ లక్ష్యంగా ‘కనెక్ట్ మాబ్‌సీన్(connekkt mobscene)’లాంటి ఏజెన్సీతో చర్చలు జరుపుతున్నట్టు ‘టిపి (The Paradise)’ టీమ్ సంకేతాలివ్వడం కూడా హైప్‌ని అమాంతం పెంచేసింది.
మోహన్‌బాబు విలన్—సెట్‌లో అగ్గి పుడుతుంది!
‘దసరా(Dasara)’ విజయానంతరం నాని–శ్రీకాంత్ ఓదెల జోడీ మళ్లీ కలిసి ‘ది ప్యారడైజ్’ కోసం అత్యంత శక్తివంతమైన విలన్‌ను వెతికే సమయంలో, ఆ పాత్రలో మోహన్‌బాబు ఫిట్ అవుతారని దర్శకుడు శ్రీకాంత్ ఫీలయ్యారని ఫిలిం నగర్ టాక్. అంతే.. ఆయన్ను అప్రోచ్ అవడం, కథ విన్న మోహన్‌బాబు ఓకే అనడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. మంచు లక్ష్మి ప్రెస్‌మీట్‌లో “డాడ్ కొత్త లుక్ కోసం గట్టి వర్కౌట్స్ చేస్తున్నారు, సెట్‌లో చిన్నపిల్లాడిలా ఇన్వాల్వ్ అవుతారు” అన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ శివార్లలో వేసిన 30 ఎకరాల భారీ స్లమ్ సెట్ మధ్య ఆయన పాత్ర ఫుల్ ఇంపాక్ట్ ఇస్తుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని రూమర్లు వేడెక్కించినా, వాటిని అందరూ నమ్మేస్తున్నారు. కారణం, చిరంజీవి హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రాని(#ChiranjeeviOdela)కి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇదొక్కటి చాలు కదా నమ్మడానికి. దర్శకుడు ఒక శక్తివంతమైన పవర్‌ఫుల్ క్యామియో కోసం మెగాస్టార్‌ని అనుకున్నారని, ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అయితేనే సూటవుతుంది, వేరేవాళ్లతో అయితే ఆ పాత్రనే సినిమాలో ఉంచను అని అన్నాడని తెలిసింది. దాంతో మెగాస్టార్‌ను కలిసిన నాని, శ్రీకాంత్ ఆయన్ను కన్విన్స్ చేసారట. ఇది నిజమైతే—మోహన్‌బాబు + చిరంజీవి అనే అనుభవం టాలీవుడ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత రిపీట్ కాబోతోంది. ఫ్యాన్స్ ఇప్పటికే #ChiruMohanBabu, #TheParadiseMovie హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను బహుభాషల్లో (తెలుగు నుంచి ఇంగ్లిష్/స్పానిష్ వరకు) 2026 మార్చి 26న విశ్వవ్యాప్తంగా విడుదల చేయాలన్న లక్ష్యంతో యూనిట్ ముందుకెళ్తోంది. అనిరుధ్ సంగీతం, సి.హెచ్. సాయి కెమెరా, SLV Cinemas భారీ నిర్మాణం అంచనాలను కొండంతలుగా పెంచుతున్నాయి..
35 ఏళ్ల తర్వాత చిరు–మోహన్‌బాబు రీయూనియన్?
80లలో ఎన్నో హిట్ సినిమాల్లో మెరిసిన ఈ కాంబినేషన్, చివరిసారి 1990లో ‘కొదమ సింహం’లో కనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించే అవకాశమే రాలేదు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో చిరంజీవి స్పెషల్ క్యామియో చేస్తున్నారని వినిపిస్తున్న రూమర్ నిజమైతే, ఇది 35 ఏళ్ల తర్వాత రీయూనియన్ అవుతుంది. శ్రీకాంత్ ఓదెల రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో పాటు ఈ కాంబో వస్తే, బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం.
అయితే ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు కానీ, మోహన్‌బాబు—చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో మళ్లీ కనబడబోతున్నారనే వార్తే ‘ది ప్యారడైజ్’ ను ఇండస్ట్రీలో టాప్ న్యూస్‌గా మార్చేసింది. నాని మాస్ ఇమేజ్, ఓదెల రా టేకింగ్, మెగాస్టార్ స్పెషల్ ప్రెజెన్స్, మోహన్‌బాబు విలనిజం — all in one అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఇక మిగలవేమో.