విధాత : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురచూస్తున్న ఓజీ సినిమా నుంచి సోమవారం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ ఓజస్ గంభీరాగా నటిస్తున్నారు. ట్రైలర్ లో హీరో పవన్ కల్యాణ్ యాక్షన్ సీన్స్ చూస్తుంటే ఆయన నుంచి అభిమానులు కోరుకునే రీతిలోనే దర్శకుడు సుజిత్ సినిమాను రూపొందించినట్లుగా కనిపిస్తుంది.
నిన్ను కలవాలని కొందరు..చూడాలని ఇంకొందరు, చంపాలని అందరు ఎదురుచూస్తున్నారన్న డైలాగ్ లు..అందుకు పవన్ పాత్ర బాంబే వస్తున్న తలలు జాగ్రత్త అంటూ చెప్పిన డైలాగ్ లు సినిమాకు భారీ హైప్ ఇచ్చాయి. తమన్ నేపథ్య సంగీతం ట్రైలర్‌లో హైలైట్‌గా ఉన్నాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.