Trivikram|ఇంట్రెస్టింగ్.. మహేష్, పవన్ కొడుకులతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..!
Trivikram|సినీ పరిశ్రమలో వారసులు సందడి చేయడం ఈ నాటిది కాదు. ఎప్పటి నుండో స్టార్ హీరోలు లేదా డైరెక్టర్స్, నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక త్వరలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తనయులు కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తొలి ప్రయత్నంలోనే అకీరా, గౌతమ్ మల్టీ స్టారర్ చిత్రం చేయబోతు

Trivikram|సినీ పరిశ్రమలో వారసులు సందడి చేయడం ఈ నాటిది కాదు. ఎప్పటి నుండో స్టార్ హీరోలు లేదా డైరెక్టర్స్, నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక త్వరలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తనయులు కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తొలి ప్రయత్నంలోనే అకీరా, గౌతమ్ మల్టీ స్టారర్ చిత్రం చేయబోతున్నారని, ఈ సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని టాక్. అటు అకీరా ఇప్పటికే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక గౌతమ్ కృష్ణ ప్రస్తుతం ఫారెన్ లో చదువుకుంటున్నాడు. అతను కూడా చదువు అయిపోయిన వెంటనేరంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు హీరోలను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని త్రివిక్రమ్(Trivikram) అనుకుంటున్నాడట.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. త్రివిక్రమ్ వీళ్లిద్దరిని పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేసి ఇద్దరిని ఒకేసారి లాంచ్ చేయాలని కొన్నాళ్లుగా చూస్తున్నాడట, అందుకు సంబంధించి కసరత్తులు కూడా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ ఇటు పవన్ కళ్యాణ్(Pawan KAlyan)కి అటు మహేష్ బాబుకి మంచి మిత్రుడు కాబట్టి ఆయన అనుకుంటే ఈ పని ఈజీగా అవుతుంది. ఇద్దరు వారసుల ఎంట్రీ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటే.. మహేష్ బాబు రాజమౌళి సినిమాలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
కాని ఇది జరిగే పరిస్థితి ఇప్పట్లో లేదు కాని… వీరి వారసులతో మాత్రం మల్టీ స్టారర్ సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇటు పవన్ కాని…. అటు మహేష్ బాబు కాని మల్టీ స్టారర్ చిత్రాలు చేసిన వారే. మహేష్ బాబు వెంటకేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేయగా.. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమాలు చేశారు. అయితే పవన్, మహేష్ కలిసి సినిమా అంటే అది ఊహకు అందదు. కాని ఇప్పట్లో ఈ కాంబో కుదిరేలా లేదు. అందుకే పవన్ కొడుకు అఖీరా నందన్, మహేష్ బాబు(MAhesh Babu) కొడుకు గౌతమ్ కాంబోలో సినిమాను చేయాలని అనుకుంటున్నారట. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.