Unstoppable 4|అన్‌స్టాపబుల్ ప్రోమో విడుదల.. అరెస్ట్, పవన్‌తో స్నేహం వంటి విషయాలపై బాబు ఆసక్తికర ముచ్చట్లు
Unstoppable 4|నందమూరి బాలకృష్ణలోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేసిన షో అన్‌స్టాపబుల్. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా నచ్చేయడంతో ప్రతి ఎపిసోడ్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సీజన్ 4 మొదలైంది. గెస్ట్‌గా ఎవరు వస్తారా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మరోసారి చంద్రబాబుని ఈ షో

Unstoppable 4|నందమూరి బాలకృష్ణ(Bala Krishna)లోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేసిన షో అన్‌స్టాపబుల్. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా నచ్చేయడంతో ప్రతి ఎపిసోడ్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సీజన్ 4 మొదలైంది. గెస్ట్‌గా ఎవరు వస్తారా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మరోసారి చంద్రబాబుని ఈ షోకి తీసుకు వచ్చారు. ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు(Chandrababu Naidu) అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయడం విశేషం. తొలి ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమో ప్రస్తుత తెగ వైరల్ అవుతోంది. ‘మా బావగారు.. మీ బాబు గారు’ అంటూ బాలయ్య ఇచ్చిన ఇంట్రో ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక షోలో అన్ని నిజాలే మాట్లాడుతానని బాలయ్య బాబు.. చంద్రబాబుతో ప్రమాణం చేశాయించారు. అయితే సమయస్ఫూర్తితో సమాధానం చెప్తానంటూ చంద్రబాబు చమత్కరించారు. అరెస్టు నుంచి తాజా రాజకీయాల వరకూ.. జైలు జీవితం గురించి ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ షోలో చంద్రబాబు పంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అరెస్ట్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఒకింత ఎమోషన్‌కు గురయ్యారు.ఆకాశంలో సూర్యచంద్రులు.. ఏపీలో బాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బాబు’’ అనే డైలాగ్ కూడా ఈ వీడియో గ్లింప్స్‌కి హైలైట్‌గా నిలిచింది.ఇక థింక్ గ్లోబలీ.. యాక్ట్ గ్లోబలీ తన స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు
అన్‌స్టాపబుల్-4 టాక్ షోను అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వెల్లడించింది. దీంతో ఈ షోపై అప్పుడే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.ఇక ఈ సీజన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(AlluArjun) కూడా ఓ ఎపిసోడ్‍కు గెస్టుగా రానున్నారు. లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఓ ఎపిసోడ్‍లో సందడి చేయనున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య కూడా అన్‍స్టాపబుల్‍కు రానున్నారని సమచారం. మొత్తంగా ఈ నాలుగో సీజన్ మరింత సక్సెస్ అయ్యేలా ఆహా గట్టిగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.