Kannappa | కన్నప్ప ఏమైందప్పా..? రిలీజ్‌ ఎప్పుడు విష్ణు..!

Kannappa | మంచు విష్ణు నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో నటించడంతో పాటు సొంతంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి కేవలం జూన్‌లో మాత్రమే టీజర్‌ వచ్చింది.

Kannappa | కన్నప్ప ఏమైందప్పా..? రిలీజ్‌ ఎప్పుడు విష్ణు..!

Kannappa | మంచు విష్ణు నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో నటించడంతో పాటు సొంతంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి కేవలం జూన్‌లో మాత్రమే టీజర్‌ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. నటీనటులకు సంబంధించిన లుక్స్‌ మాత్రమే రిలీజ్‌ చేశారు. ఏమైందో కానీ ఇప్పటి వరకు మూవీ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దసరా, దీపావళి పండుగలు వచ్చినా ఎలాంటి అప్‌డేట్స్‌ని టీమ్‌ ఇవ్వలేదు. భారీ బడ్జెట్‌తో కన్నప్ప మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే, సినిమా టీజర్‌తో పాటు లుక్స్‌ ట్రోల్‌కి గురయ్యాయి. కొత్తగా విడుదల చేసే టీజర్‌, పోస్టర్స్‌ పర్ఫెక్ట్‌గా విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. మూవీ రిలీజ్‌ ఎప్పుడు క్లారిటీ మాత్రం బయటకు రావడం లేదు.

అయితే, కన్నప్ప షూటింగ్‌ ఎంత వరకు వచ్చిందని తెలియరాలేదు. మంచు విష్ణు కన్నప్ప మూవీని మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. ప్రభాస్‌, అక్షయ్‌కుమార్‌, మోహన్‌లాల్‌ స్టార్స్‌ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, కన్నప్ప రిలీజ్‌ ప్రకటించకపోవడానికి సినిమా బిజినెస్ జరగకపోవడం రీజన్‌గా భావిస్తున్నారు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప మూవీని డిసెంబర్‌ రిలీజ్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది మూవీ రిలీజ్‌ కాకపోవచ్చని సమాచారం. వచ్చే ఏడాది సినిమా రిలీజ్‌ బరిలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, కాజల్‌ అగర్వాల్‌ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రూ.100 నుంచి రూ.200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నది.