War 2 OTT Release | అభిమానులకు పండుగే..ఓటీటీలోకి వార్ 2 మూవీ
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2'(War-2) మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అభిమానులు ఓటీటీలో చూడవచ్చు.

విధాత : ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) లతో రూపొందించిన వార్ 2 మూవీ ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లతో సరిపెట్టుకుంది. రజనీ కాంత్ మూవీ కూలీ తో పోటీ పడి బాక్సాఫీస్ వద్ద వెనుకబడింది. హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ(Kiara Advani) వంటి స్టార్లు ఉన్నప్పటికి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈనెల 9నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix) లో ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. థియేటర్ లో చూడలేకపోయిన ఈ మల్టీ స్టారర్ మూవీని ఇక అభిమానులు ఓటీటీలో చూడవచ్చు. మాజీ రా ఏజెంట్ పాత్రలో హృతిక్ రోషన్, అతడిని పట్టుకునే సోల్జర్ విక్రమ్ చలపతి పాత్రలో ఎన్టీఆర్ పోటాపోటీగా నటించిన ఈ చిత్ర కథ ఆసక్తికరమైన మలుపులు, యాక్షన్ సన్నివేశాలలో సాగుతుంది.