Ntr-Anushka|ఎన్టీఆర్- అనుష్క మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా…అందుకే ఒక్క సినిమా కూడా చేయలేదా?
Ntr-Anushka| టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఆ కాంబోలో సినిమా వస్తే ముందే భారీ అంచనాలు ఉంటాయి. ఇక కొన్ని కాంబినేషన్స్ వస్తే బాగుండు అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ గమనిస్తున్నారు.అయితే ఈ కాంబో కుదరకపోవడానికి కారణం ఎన్టీఆర్-అనుష్క మధ్య వచ్చిన గొడవేనని టాక్. అనుష్క శెట్టి, యంగ్ టైగర్ ఎ

Ntr-Anushka| టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఆ కాంబోలో సినిమా వస్తే ముందే భారీ అంచనాలు ఉంటాయి. ఇక కొన్ని కాంబినేషన్స్ వస్తే బాగుండు అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ గమనిస్తున్నారు.అయితే ఈ కాంబో కుదరకపోవడానికి కారణం ఎన్టీఆర్-అనుష్క మధ్య వచ్చిన గొడవేనని టాక్. అనుష్క శెట్టి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య కూడా మూడో వ్యక్తి కారణంగా ఒక కోల్డ్ వార్ నడిచింది. ఈ విషయం బయటకు రాలేదు కాని సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అనుష్క, ఎన్టీఆర్‌ల మధ్య అప్పట్లో పెద్ద గొడవే జరిగిందట.
జూ.ఎన్టీఆర్ దాదాపు అందరూ సౌత్ ఇండియన్ హీరోయిన్లతో నటించాడు.కానీ అగ్రతార అనుష్కతో మాత్రం ఒక్క సినిమా కూడా అతను తీయలేదు. కాకపోతే ఒక్క పాటలో మాత్రం ఇద్దరు కలిసి నటించారు. వెంకటేష్, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన చింతకాయల రవి సినిమాలో ఒక పార్టీ సాంగ్ వస్తుంది.అప్పుడు అనుష్క, వెంకటేష్‌లతో ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తాడు. దాని తర్వాత వీరిద్దరి కాంబోలో మళ్లీ ఎలాంటి సీన్లు, సినిమాలు రాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ అనుష్క కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉంది.అదే శక్తి (2011).మెహర్ రమేష్ ఈ మూవీలో అనుష్కను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకోవాలని భావించాడు. సినిమా కథ చెప్పి ఆమెని ఒప్పించి డేట్స్ కూడా తీసుకున్నాడు.
అయితే ఒక సీనియర్ నిర్మాత ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అనుష్కతో సినిమా చేయకండి అని చెప్పాడట.“అరుంధతి సినిమా రూ.30 కోట్లు వసూలు చేసింది, ఏ హీరో సినిమా కూడా ఆ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయలేదు.కాబట్టి అనుష్క చాలా పొగరుగా మాట్లాడుతుంది.హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతుంది.” అని లేనిపోని చాడీలు చెప్పడంతో అది నిజమేనని భావించిన ఎన్టీఆర్ ఆమెతో సినిమాకి నో చెప్పాడట. అందుకే మెహర్ రమేష్ కి ఫోన్ చేసి అనుష్క వద్దు, ఇలియానాని హీరోయిన్‌గా ఎంపిక చేసుకోండి అని చెప్పాడట.ఆ విషయం తెలిసి అనుష్క కూడా ఎన్టీఆర్ పై కోపం పెంచుకుందట. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఓ టాక్ నడుస్తుంది