లోబో తో కలిసి సిగరెట్‌ తాగుతున్న భామలు

విధాత:బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే మేల్‌ కంటెస్టెంట్లలో పెళ్లైనవాళ్లు, చిన్నపిల్లే ఉన్నారని.. తనకెవరూ కనెక్ట్‌ అయ్యేలా లేరని లహరి షారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ప్రియాంక సింగ్‌ అందరినీ బ్రో అని పిలిచింది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనని సిగ్గులమొగ్గయింది. ఇక యానీ మాస్టర్‌ మార్నింగ్‌ డ్యాన్స్‌లో మాత్రమే కనిపిస్తుండగా తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్‌ జోన్‌లో దర్శనమిచ్చారు. లోబోతో కలిసి […]

లోబో తో కలిసి  సిగరెట్‌ తాగుతున్న భామలు

విధాత:బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే మేల్‌ కంటెస్టెంట్లలో పెళ్లైనవాళ్లు, చిన్నపిల్లే ఉన్నారని.. తనకెవరూ కనెక్ట్‌ అయ్యేలా లేరని లహరి షారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ప్రియాంక సింగ్‌ అందరినీ బ్రో అని పిలిచింది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనని సిగ్గులమొగ్గయింది. ఇక యానీ మాస్టర్‌ మార్నింగ్‌ డ్యాన్స్‌లో మాత్రమే కనిపిస్తుండగా తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్‌ జోన్‌లో దర్శనమిచ్చారు.

లోబోతో కలిసి ఈ ఇద్దరు భామలు దమ్ము లాగుతూ కనిపించారు. గుప్పుమని పొగలు వదులుతూ ఇంటి ముచ్చట్లను ప్రస్తావించారు. ఇంటి సభ్యుల్లో కొందరు కనెక్ట్‌ కావడం కష్టమని, బయటే కనెక్ట్‌ అవుతామంటూ సంభాషించారు. అనంతరం సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని బదులిచ్చాడు లోబో. అన్‌సీన్‌ ఎపిసోడ్‌లో ప్రసారం చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అరేయ్‌ ఏంట్రా ఇది?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.