Champion Teaser : యంగ్ హీరో రోషన్ ‘ఛాంపియన్‌’ టీజర్ విడుదల

రోషన్ మేక నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్‌’ టీజర్ థ్రిల్ రేపింది. బ్రిటీష్ పీరియడ్‌లో సాగిన ఫుట్‌బాల్ కథతో సినిమా ఆసక్తి పెంచింది.

Champion Teaser : యంగ్ హీరో రోషన్ ‘ఛాంపియన్‌’ టీజర్ విడుదల

విధాత : సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా జాతీయ అవార్డు గ్రహిత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఛాంపియన్‌’ నుంచి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో యంగ్ హీరో రోషన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు మైకేల్ పాత్ర‌లో కనిపిస్తున్నారు. టీజర్ చూస్తే సినిమా కథ బ్రిటీష్ పీరియడ్‌లో జ‌రిగే క‌థాంశంగా క‌నిపిస్తోంది. ఏకంగా ప‌ద‌కొండు మంది బ్రిటీష‌ర్స్ ఓ వైపు.. హీరో రోషన్ త‌నొక్క‌డే మ‌రో వైపు నిల‌బ‌డి.. సెంటర్‌కి వెళ్లి బాల్ తీసుకొని వెళ్తా గోల్ కొడతా అంటూ ఛాలెంజ్ చేయ‌టం..సైన్యంతో హీరో పోరాట దృశ్యాలు సినిమాపై అసక్తిని కల్గించేలా ఉన్నాయి.

అన‌స్వ‌ర‌ రాజ‌న్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రియాంక ద‌త్, జెమినీ కిర‌ణ్‌, జికె మోహ‌న్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఛాంపియన్’ మూవీ డిసెంబ‌ర్ 25న మూవీ రిలీజ్ కాబోతుంది. డెబ్ల్యూ మూవీ పెళ్లి సందడి తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న రోషన్ మేక కెరీర్ కు ‘ఛాంపియన్‌’ సినిమా కీలకం కానుంది.