రాహుల్ హత్యకేసు.. మచిలీపట్నం జైలుకు కోగంటి సత్యం
విధాత: యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసులో నిందితుడు కోగంటి సత్యంను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఒకటో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు సత్యంకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను మచిలీపట్నం జైలుకు తరలించారు. రాహుల్ హత్యకేసులో కీలకనిందితుడిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కోగంటి సత్యంకు హత్యతో సంబంధం ఉందని తేలింది. అదే సమయంలో సత్యం పోలీసుల కళ్లుగప్పి విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు బెంగళూరు […]

విధాత: యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసులో నిందితుడు కోగంటి సత్యంను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఒకటో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు సత్యంకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను మచిలీపట్నం జైలుకు తరలించారు. రాహుల్ హత్యకేసులో కీలకనిందితుడిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కోగంటి సత్యంకు హత్యతో సంబంధం ఉందని తేలింది. అదే సమయంలో సత్యం పోలీసుల కళ్లుగప్పి విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు. బెంగళూరు వెళ్లి అతన్ని అరెస్టు చేసి దేవనహళ్లి కోర్టులో హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తరలించారు. సత్యంకు ఈకేసుతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? పరోక్షంగా ఉండి హత్యకు పథకం వేశాడా? అనే విషయాలను కోరాడ నుంచి పోలీసులు రాబట్టి నట్టు తెలుస్తోంది.