Medak |
నాలుగుకు చేరిన మృతులు
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి సమీపంలో గత 2 రోజులక్రితం, ఆర్టీసీ బస్, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు స్పాట్ డెడ్ కాగా మరో ఇద్దరు భార్యభర్తలు మెదక్ నియోజకవర్గ బీఅర్ యస్ పార్టీ నాయకుడు దుర్గా గౌడ్, ఆయన సతీమణి లావణ్య చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు.
ఈ ఘటనలో నలుగురికి చేరిన మృతుల సంఖ్య.. గాయపడ్డ వారు రోజుకొక్కరు మృతి చెందడంతో ఆ కుటుంబం.. ఆ గ్రామం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.వివరాలు ఇలా వున్నాయి .మెదక్ జిల్లా
పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామం దుఃఖ సాగరంలో మునిగింది.
ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఏలాంటి చింత లేకుండా సాఫీగా బతుకుతుంది. శుక్ర వారం రోజు ఒక వివాహానికి నవ్వుతూ, తుల్లుతూ బయలుదేరారు ఆ కుటుంబ సభ్యులు. ఆ నవ్వులు ఇంకెంతో కాలం ఉండలేవని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది.
పాపం ఆ కుటుంబం ను విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో రోజుకొకరిని మింగేసింది దీంతో ఎల్లాపూర్ గ్రామం మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. రోజుకు ఒకరి మృతి వార్త, రోజుకొకరి అంత్యక్రియలతో ఎల్లాపూర్ లో ఏ ఇంటిని పలకరించిన కన్నీటిపర్యంతమే అవుతున్నారు..
వివరాలలోకి వెళ్తే ఎల్లాపూర్ గ్రామంలో దుర్గ గౌడ్, నాగరాజు గౌడ్ అని అన్నదమ్ములు, ఎల్లాపూర్ కే ఆదర్శంగా వారు జీవనం సాగిస్తున్నారు, వీరిని విధి వంచించింది, పెళ్లికనీ వెళ్లి మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు.
శుక్రవారం రోజు పెళ్లికని కుటుంబ సభ్యులు కారులో దౌల్తాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సొంత గ్రామమైన ఎల్లాపూర్ కు వస్తుండగా, కొల్చారం శివారులో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో నాగరాజు గౌడ్ అతడి అన్న కూతురు హర్షిత ఘటనా స్థలంలోని మృతి చెందారు, ఇక దుర్గ గౌడ్ అతడు భార్య తీవ్ర గాయాలయి హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు.
అయితే శనివారం నాగరాజు గౌడ్ తో పాటు హర్షిత అంత్యక్రియలు పూర్తయ్యాయో లేవో, దుర్గ గౌడ్ మృతి చెందినట్లు సమాచారం వచ్చింది, దీంతో గ్రామస్తులు తల్లిడిల్లిపోయారు. అతడి శవం కూడా ఇంకా ఇంటికి చేరనే లేదు, ఆదివారం ఉదయం అతడి భార్య లావణ్య మృతి వార్త పిడుగుల పడింది.
దీంతో ఉన్న దాంట్లో కలో గంజో తింటూ సుఖసంతోషంగా, ఉండే పల్లెటూరు కుటుంబాలు క్షణక్షణం వస్తున్న పిడుగు లాంటి వార్తలతో చలించిపోయాయి. ఊరుకు ఊరు బాధిత కుటుంబం ఇంటి వద్దకు చేరి బరువెక్కిన హృదయాలతో చలించిపోతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. అందరూ పొగా మిగిలిన ఇరువురు చిన్నారులను చూసి గ్రామస్తుల గుండెలు అవిసిపోతున్నాయి.
ఎమ్మెల్యే పద్మా రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని పేర్కొన్నారు.