Odisha students eyes Fevikwik| విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్..కళ్లు తెరుచుకోలేక అవస్థలు
పాఠశాల హాస్టలులో నిద్రిస్తున్న 3,4తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థి ఫెవిక్విక్ వేశారు. దీంతో బాధిత విద్యార్థులు కళ్లు తెరవలేని విషమ పరిస్థితి ఏర్పడింది. ఒడిశా కంధమాల్ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జరిగింది
విధాత: నిద్రిస్తున్న విద్యార్థుల(Students) కళ్లలో(Eye) తోటి విద్యార్థి ఫెవిక్విక్(Fevikwik)పోసిన ఘటన కలకలం రేపింది. ఒడిశా(Odisha) కంధమాల్(Kandhamal) జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. ఫూల్బానీ పట్టణంలోని సాలగూడ సేవాశ్రమ పాఠశాల హాస్టలులో నిద్రిస్తున్న 3,4తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థి ఫెవిక్విక్ వేశారు. దీంతో బాధిత విద్యార్థులు కళ్లు తెరవలేని విషమ పరిస్థితి ఏర్పడింది. వారు కంటిచూపు సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాధిత విద్యార్థులు శుక్రవారం ఉదయం నిద్ర లేచేందుకు ప్రయత్నించగా కళ్లు తెరుచుకోలేదు. వెంటనే పాఠశాల నిర్వాహకులు బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం వారికి ఎలాంటి ప్రమాదం లేదని..అయితే కళ్లు తెరిచేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. సేవాశ్రమ్ హెడ్‌మాస్టరు మనోరంజన్ సాహుపై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా కలెక్టరు ఈ ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram