మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష
నల్లగొండలో మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి పోక్సో కోర్టు ఉరిశిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది.

విధాత, హైదరాబాద్ : నల్లగొండలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడిన కేసులో పోక్సో కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా వేసింది. పదేళ్ల క్రితం జరిగిన ఈ కేసు విచారణలో తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.
2013లో నల్లగొండలో ఓ 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసిన నిందితుడు మోహమ్మి ముఖ్రం ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. 10 ఏళ్లుగా కొనసాగిన ఈ కేసు విచారణ ముగిసిపోగా గురువారం కోర్టు తుది తీర్పునిచ్చింది.
ఇవి కూడా చదవండి…