బీఆరెస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీసీపీతో సహా ముగ్గురు అధికారుల సస్పెండ్
ముషీరాబాద్ నియోజకవర్గం బీఆరెస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పంధించిన పోలీస్ కమిషనర్ బుధవారం డీసీపీ వెంటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్ లను సస్పెండ్

విధాత: బీఆరెస్ ముషీరాబాద్ నియోజకవర్గం బీఆరెస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పంధించిన పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య బుధవారం సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంటేశ్వర్లు, చిక్కడ పల్లి ఏసీపీ ఏ. యాదగిరి, ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్‌లను సస్పెండ్ చేశారు. వీరి స్థానంలో డీసీపీగా నిఖితా పంత్, ఎన్. అశోక్‌కుమార్, డి.శ్రీనివాస్‌లలో ఒకరిని, ఏసీపీగా కె. మధు మోహన్‌రెడ్డి, జె.నర్సయ్య, పి. శ్రీనివాసులు నాయుడుల పేర్లలో ఒకరిని నియమించాలని ఎన్నికల కమిషన్‌కు రికమండ్ చేశారు. అలాగే ముషీరాబాద్‌లో డీఐగాపని చేస్తున్న డి. వెంకటరెడ్డిని ముషీరాబాద్ సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.