03.07.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు పాత అప్పులు చెల్లిస్తారు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - July 3, 2024 / 06:36 AM IST

మేషం

ఈ రోజు మీరు వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. కానీ సవాళ్లు కూడా ఉంటాయి. సహోద్యోగుల పట్ల అసంతృప్తిగా ఉంటారు. అర్థరహితమైన విషయాలను పదే పదే పునరావృతం చేయొద్దు. వైవాహిక జీవితం బావుంటుంది.

వృషభం

ఈ రోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారులకు నూతన అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. భార్యాభ‌ర్త‌లు అన్యోన్యంగా ఉంటారు.

మిధునం

ఇంట్లో కానీ, ప‌ని ప్ర‌దేశంలో కానీ సంయమనం పాటించండి, రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత – వృత్తి జీవితం మధ్య సమన్వయ లోపం ఉండవచ్చు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

కర్కాటకం

ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప‌నులు పూర్త‌వుతాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి:

సింహం

ఈ రోజు సింహరాశికి చెందిన వ్యాపారులు.. ప్రణాళికలను వాయిదా వేయడానికి బదులు వాటిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కన్య

ఈ రోజు ఈ రాశివారి పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత చదువుకోసం ప్రయత్నిస్తున్నవారికి కొన్ని ఇబ్బందులుండొచ్చు. కోపం తగ్గించుకోవాలి. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

తుల‌

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేయలేరు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల విషయంలో అడ్డంకులు తప్పవు. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండాలి.

వృశ్చికం

ఈ రాశివారు సహాయం చేయడంలో ముందుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నూతన ఉద్యోగం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం.

ధనస్సు

మీ సమస్యలకు ఇతరులను బాధ్యులను చేయవద్దు. షేర్లు , స్టాక్ మార్కెట్ నుంచి ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. పాత అప్పులు చెల్లిస్తారు. ఆదాయం బావుంటుంది.

మకరం

ఈ రోజు స్నేహితులతో వివాదాలు జరగొచ్చు. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారంలో ఉన్నవారు నష్టపోతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వహించడం తగదు.

కుంభం

ఈ రోజు మీ సహోద్యోగులతో వివాద సూచనలున్నాయి. అన్ని పనులను ప్రణాళిక ప్రకారం పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కొన్నిరోజుల పాటూ వాయిదా వేసుకోవడం మంచిది.

మీనం

ఈ రోజు మీరు పనిలో కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తక్కువ పని , ఎక్కువ ప్రశంసలతో ఈ రోజు సంతోషంగా గడిచిపోతుంది.

Latest News