02.07.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి విశేష శుభ‌ఫ‌లితాలు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - July 2, 2024 / 06:55 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలుంటాయి. విశేషమైన ధనలాభం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. సహనంతో మెలిగితే మంచిది. వ్యాపారులకు పోటీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి, మిత్రుల నుంచి లబ్ధి పొందుతారు. ఆదాయం ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తి పరమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. తగిన విశ్రాంతి అవసరం. ఇబ్బందులకు గురి చేసే వారు పక్కనే ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం పెరుగుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతారు. అనవసర గొడవలు, వివాదాలు ఏర్పడకుండా సహనం పాటించాలి. కుటుంబ వివాదాలలో మౌనం వహిస్తే మంచిది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారు పని పట్ల శ్రద్ధ ఏకాగ్రత పెంచాలి. కుటుంబ బాధ్యతల పట్ల దృష్టి సారిస్తారు. ధనలాభాలు ఆశించిన మేరకు ఉండవచ్చు. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మాటలు అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభతో, మేధస్సుతో ఆలోచించి కీలకమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. బద్దకించకుండా ఎప్పటి పనులు అప్పుడే సకాలంలో పూర్తి చేసుకుంటే ఇబ్బందులుండవు. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం వుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సహనంతో ఉంటే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మకరం

మకరరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి మనోబలంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు ఈ రోజు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసి శభాష్ అనిపించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసే పనికి చెప్పే మాటలకూ పొంతన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. వ్యాపారంలో నష్టాలూ రాకుండా జాగ్రత్త పడాలి.

Latest News