Hair cutting | ఎప్పుడుపడితే అప్పుడు హెయిర్‌ కటింగ్‌తో అరిష్టమట.. వారంలో ఆ రెండు రోజులే మంచిదట..!

Hair cutting | హిందూ సంప్రదాయంలో మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పాటించాల్సిన అనేక నియామకాలు, నమ్మకాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలన్నా ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించాలని హిందూమతం సూచిస్తోంది. హెయిర్ కటింగ్‌ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట రోజులలో జుట్టు కత్తిరించుకోవద్దని చెబుతారు.

Hair cutting | ఎప్పుడుపడితే అప్పుడు హెయిర్‌ కటింగ్‌తో అరిష్టమట.. వారంలో ఆ రెండు రోజులే మంచిదట..!

Hair cutting : హిందూ సంప్రదాయంలో మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పాటించాల్సిన అనేక నియామకాలు, నమ్మకాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలన్నా ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించాలని హిందూమతం సూచిస్తోంది. హెయిర్ కటింగ్‌ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట రోజులలో జుట్టు కత్తిరించుకోవద్దని చెబుతారు. ఈ నియమాలను పాటించకపోతే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపైన, ఆర్థిక పరిస్థితిపైన ప్రతికూల ప్రభావం పడుతుందని అంటారు. ఉజ్జయినికి చెందిన జ్యోతిష్య పండితుడు రవి శుక్లా చెప్పిన ప్రకారం.. హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి శుభ, అశుభ దినాలు గురించి వివరించారు.

అశుభ దినాలు

సోమవారం

సోమవారం హెయిర్ కటింగ్‌ చేయించుకోవడంవల్ల మన పిల్లల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రోజున హెయిర్‌ కంటింగ్‌ చేయించుకోవద్దట.

ఆదివారం

చాలామందికి సెలవు దినం కావడంతో ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటారు. కానీ ఆదివారం హెయిర్ కటింగ్‌ చేయించడం మంచిది కాదట. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందట. భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోలేరట. జీవితంలో ఎదిగే అవకాశాలు తగ్గుతాయట.

మంగళవారం

మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన రోజు. అందుకే మంగళవారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే మంచిది కాదని విశ్వసిస్తారు. ఆయుష్షు తగ్గుతుందని అంటారు.

శనివారం

శనివారం శని దేవుడికి అంకితం. హిందూ మతంలో శని దేవుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. శని ప్రతి వ్యక్తికి వారి కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అయితే జీవితంలో అడ్డంకులను తొలగించడానికి హిందువులు ఈ దేవుడిని పూజిస్తారు. శనివారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే శని దేవుడి ఆగ్రహానికి గురవుతారట. ఫలితంగా అనారోగ్యం, ఆర్థిక బాధలు కలుగుతాయట.

గురువారం

గురువారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే గురు గ్రహం బలహీనమవుతుందట. దాంతో జీవితంలో అనేక అవాంఛనీయ సమస్యలు ఎదురవుతాయట.

శుభ దినాలు

బుధవారం

బుధవారాన్ని వినాయకుడికి అంకితం చేశారు. కాబట్టి ఈ రోజు చేసే ప్రతి పని శుభప్రదంగా ఉంటుందని విశ్వసిస్తారు. అంటే బుధవారం హెయిర్ కటింగ్‌ చేయించుకున్నా, ఇంకా ఏది చేసినా మంచే జరుగుతుందట.

శుక్రవారం

శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేశారు. శుక్రవారం కూడా హెయిర్ కటింగ్‌ చేయించుకున్నా, ఏ పని చేసినా శుభం జరుగుతుందని నమ్ముతారు.