Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి కుటుంబంలో అభిప్రాయ భేదాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మబుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉన్నతమైన వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక పరిసితి మెరుగ్గా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రమోషన్, ఆర్థిక లాభాలు ఉండవచ్చు. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తిని పొందుతారు. ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి సారిస్తే మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఆర్ధిక వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆచి తూచి అడుగేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు చేపడతారు. పదవీయోగం ఉంది. బాధ్యతాయుతంగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా సులువుగానే పరిష్కారం అవుతాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మీ మొండితనం, ఉద్రేక స్వభావంతో కుటుంబంలో ఉద్రిక్తపూరిత వాతావరణం ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సద్భుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తి పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ స్థానచలనం ఉండవచ్చు. వాదోపవాదాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ వ్యవహారాల్లో సహనం, శాంతంతో ఉండడం అవసరం.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో, స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. ప్రారంభించిన పనులన్నీ సఫలం అవుతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దలతో, అధికారులతో మితభాషణం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఏర్పడుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram