బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి..!

మేషం

ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో కాలం గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. నమ్మక ద్రోహం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

వృషభం

భవిష్యత్ గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే. కఠినమైన సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సంబంధాలు మెరుగు పడతాయి. శివారాధన శ్రేయస్కరం.

మిథునం

పనులు సహచరుల సహకారంతో సకాలంలోనే పూర్తి చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం

అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో పురోగతి, ఆర్ధిక లాభాలు ఉంటాయి. పెట్టుబడుల మీద మంచి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

సింహం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. పనిభారం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

కన్య

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మధురస్మృతులను నెమరు వేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఆర్ధికంగా పలు ప్రయోజనాలను అందుకుంటారు. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం

ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా విశేష ప్రయోజనాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు

గతంలో చేసిన పొరపాట్ల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించే పనిలో ఉంటారు. విజయం కోసం తీవంగా కృషి చేసినా ప్రశంసలు లభించక నిరాశ చెందుతారు. సహనంతో ఉంటే మేలు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా నడుచుకోకపోతే సమస్యలు తప్పవు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరించదు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విపరీతమైన లాభాలు పొందుతారు. మీడియా, పత్రికా రంగాల వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అధికారుల ప్రశంసలు పొందుతారు.