Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారు కోపం అదుపులో ఉంచుకుంటే బెటర్..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులకు విదేశీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరమైన సమస్యలు చికాకు పెడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో సమన్వయంతో నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన వృత్తిలో స్వయంకృషితో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. మొహమాటంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారి సూచనలు పాటించడం ఉత్తమం. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కోసం కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సొంత నిర్ణయాలకన్నా సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగవచ్చు. వినోదాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకమైన రోజు. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాల వలన నష్టం కలుగుతుంది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. ఉద్యోగులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. ప్రమాదకరమైన ఘటనలకు దూరంగా ఉండటం మంచిది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి పరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. దైవబలం రక్షిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకోవాలి. అనైతికమైన కార్యకలాపాలకు దూరంగా ఉండడం అవసరం. కోపం అదుపులో ఉంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram