Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఇంటా, బ‌య‌ట ఉద్రిక్త ప‌రిస్థితులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Oct 30, 2025 6:14 AM IST
Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఇంటా, బ‌య‌ట ఉద్రిక్త ప‌రిస్థితులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో వేగం పెంచాలి. ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమయానుకూల నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శుభ యోగాలున్నాయి. ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో స్థిరమైన నిర్ణయాలతో మేలు జరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో, ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు తమ భాగస్వాముల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఒక సంఘటనతో తీవ్రంగా కలత చెందుతారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగులు పై అధికారులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఆచి తూచి అడుగేయాలి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాలలో ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సంతానం గురించి ఆందోళన చెందుతారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో సహనం పాటించండి. అనవసర వివాదాలు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనిఒత్తిడి పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే, ప్రయాణం మానుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. శుభవార్తలు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ధన వస్తు లాభాలున్నాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అశాంతిగా ఉండవచ్చు. సమయానికి పనులు పూర్తి కాకపోవడం నిరుత్సాహం కలిగిస్తుంది. ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండడం అవసరం. అనవసర వాదనలు, చర్చలు కుటుంబ కలహాలకు కారణమవుతాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో వ్యాపారంలో నష్టం రావచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి.