నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేష రాశి వారికి ఈ రోజంతా సరదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు కష్టించి పనిచేసి మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా మీరు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కీలకమైన వ్యవహారంలో ఖచ్చితమైన ప్రణాళికతో నడుచుకొని సత్ఫలితాలను పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదొడుకులు కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. బద్దకాన్ని వీడి చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. కొన్ని ఘటనలు ఆందోళన కలిగించవచ్చు. సహచరుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సన్నిహితులతో సంబంధాలు బలోపేతం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యుల, సహచరుల అండతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని అదృష్టం కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు.
తుల
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కళలు, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. పనిలో మీరు చూపే నైపుణ్యం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కుటుంబంలో కలహాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఆరోగ్య పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. వ్యాపారంలో ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంత కాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి చేసే పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అధికంగా శ్రమించాల్సిన పనులకు ఈ రోజు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.