Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి విపరీతమైన ఖర్చులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
ఈ రోజు మీరు ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ప్రయత్నాలు వేగవంతమవుతాయి. వృత్తిపరంగా అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి (Taurus)
పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. రోజు చివర్లో డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. అధిక ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.
మిథున రాశి (Gemini)
వ్యాపారస్తులకు కోరుకున్న లాభాలు దక్కుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో మంచి ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సౌకర్యాల కోసం చేసే ఖర్చులు బడ్జెట్‌ను దెబ్బతీస్తాయి.
కర్కాటక రాశి (Cancer)
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రోజు ప్రారంభంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించుకోవాలి.
సింహ రాశి (Leo)
మీకు అనుకోని మార్గాల్లో ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులకు తలపెట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రోజు ప్రారంభంలో ఖర్చులు పెరగవచ్చు. ప్రతికూల ఆలోచనల ప్రభావం మనస్సుపై ఉండవచ్చు.
కన్య రాశి (Virgo)
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఊహించని విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు.కొన్ని పెద్ద ఖర్చుల వల్ల ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. శారీరకంగా, మానసికంగా కొంత అస్థిరత ఉండవచ్చు.
తులా రాశి (Libra)
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలాలు లభిస్తాయి. వేతన జీవులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వైవాహిక జీవితంలో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మరింత సమయం గడపడం మంచిది.
వృశ్చిక రాశి (Scorpio)
ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైన విషయాలపై ఎక్కువ కోపం రాకుండా చూసుకోవాలి. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius)
పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండటం మంచిది. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.
మకర రాశి (Capricorn)
ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. టెక్నికల్ ఉద్యోగులకు అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి (Aquarius)
చిరకాలంగా వసూలు కాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. మీ సరదా స్వభావం ఇతరులను సంతోషంగా ఉంచుతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు ఎక్కువగా నమ్మిన వ్యక్తుల నుండి నిరాశ ఎదురవ్వవచ్చు.
మీన రాశి (Pisces)
మీకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అంత అనుకూలం కాదు. వ్యాపారస్తులకు సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది.ఈ రోజు గ్రహబలాలు పాక్షికంగా అనుకూలంగా ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పెట్టుబడులు లాభాలు తీసుకురావు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram