Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ధ‌న న‌ష్టం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ధ‌న న‌ష్టం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువులు సేకరిస్తారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. కొన్ని ఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపారులు భాగస్వాములతో మనస్పర్థలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో సమస్యలు, ఒత్తిడి, అపార్థాలు, కుటుంబ సభ్యులతో వివాదాలతో మనశ్శాంతి లోపిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చేసుకోడానికి సరైన సమయం. ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉందని ఫలితాలు చెబుతున్నాయి. వృధాగా డబ్బు ఖర్చవుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తీర్థయాత్రలకు వెళ్తారు. దృఢమైన సంకల్పంతో వృత్తిలో విజయం సాధిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. కొన్ని ఘటనలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోండి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆత్మవిశ్వాసం లోపించకుండా జాగ్రత్త పడండి. ఆటంకాలు సృష్టించే వారుంటారు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా జాగ్రత్త వహించండి. అధికారులతో, ముఖ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తితో ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మచింతనతో చేసే పనులు మంచి గుర్తింపు తీసుకు వస్తాయి. గొప్పవారితో పరిచయాలు మున్ముందు ఉపయోగపడతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ధననష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోడానికి అనుకూలమైన సమయం. తారాబలం అనుకూలంగా ఉన్నందున స్వల్ప ప్రయత్నంతోనే విజయం సిద్ధిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి.