Money Remedies | ధ‌నం రెట్టింపు కావాలంటే.. ఈ మూడింటిని చీమ‌ల‌కు ఆహారంగా పెట్టండి..!

Money Remedies | జీవితంలో ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదిస్తారు. కానీ ఆ సంపాద‌న మిగ‌ల‌దు. మ‌రి సంపాదించిన ధ‌నం రెట్టింపు కావాలంటే కొన్ని నియ‌మాలు పాటించాల‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Money Remedies | ధ‌నం రెట్టింపు కావాలంటే.. ఈ మూడింటిని చీమ‌ల‌కు ఆహారంగా పెట్టండి..!

Money Remedies | ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌వించేందుకు ధ‌నం సంపాదిస్తే స‌రిపోదు. ఆ ధ‌నాన్ని నిల‌బెట్టుకోవాలి. అంతేకాకుండా రెట్టింపు ఎలా చేయాలో ఆలోచించాలి. అప్పుడే జీవితంలో మ‌రింత ఎత్తుకు ఎదుగుతారు. కానీ చాలా మంది సంపాదించిన సొమ్మును నిల‌బెట్టుకోలేరు. వృద్ధి కూడా చేసుకోలేరు. ఇలాంటి వారు కొన్ని ప‌రిహారాలు చేయాల‌ని అప్పుడే ధ‌న వృద్ధి కలుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ముఖ్యంగా ఈ మూడు ప‌దార్థాల‌ను క‌లిపి చీమ‌ల‌కు ఆహారంగా పెడితే.. త‌ప్ప‌కుండా ధ‌నం రెట్టింపు అవుతుంద‌ని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో చీమ‌లు ఉంటే.. వాటిని చంపేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాం. చాక్‌పీస్‌తో వాటిని నిర్మూలించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం. కొంద‌రైతే చీమ‌ల‌కు చ‌క్కెర పెడుతుంటారు. ఇలా చ‌క్కెర పెట్ట‌డం కంటే.. ఎండు క‌ర్జూర‌పు పొడి, చ‌క్కెర‌, ఎండు కొబ్బ‌రి క‌లిపి చీమ‌ల‌కు ఆహారం పెడితే.. ఆ ఇంట్లో ధ‌నం రెట్టింపు కావ‌డం ఖాయ‌మ‌ని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని సూచిస్తున్నారు.

ఇక మేడి చెట్టు కూడా ధ‌న వృద్ధిని క‌లుగజేస్తుంది. మీకు మేడిచెట్టు కనబడితే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసివచ్చినటువంటి రవి పుష్యయోగమున్న రోజు గానీ.. లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసివచ్చినటువంటి గురు పుష్యయోగమున్న రోజు ఇంటికి తీసుకురండి. దానిని పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే ఆ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు.

ఒకవేళ మీకు మేడిచెట్టు వేర్లు దొరకపోతే.. మర్రి చెట్టు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చు. గురు పుష్యయోగమున్న రోజు లేదా రవి పుష్యయోగమున్న రోజున ఆరు మర్రిచెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. వాటిపై తడి పసుపుతో స్వస్తిక్​ గుర్తు వేసి పూజ గదిలో పెట్టి, అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచాలట. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజగదిలో ఉండడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.