Love Journey | ఈ ఐదు రాశుల అమ్మాయిలతో ‘లవ్ జర్నీ’ కష్టం..! జర జాగ్రత్త..!!
Love Journey | మీరు అబ్బాయిలా..? లవ్( Love )లో పడిపోవాలనుకుంటున్నారా..? మీ మనసుకు నచ్చిన అమ్మాయిలతో( Girls ) ప్రేమ జీవితాన్ని( Love Life ) అనుభవించాలనుకుంటున్నారా..? అయితే ఈ ఐదు రాశుల అమ్మాయిలతో జర జాగ్రత్త.. పొరపాటున ఈ రాశుల అమ్మాయిలను ప్రేమిస్తే.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.

Love Journey | యువతీయువకుల మధ్య ఆకర్షణ( Attraction ) సహజం. కొంతమందిలో ఈ ఆకర్షణే ప్రేమ( Love )గా మారుతుంది. అలా అని చెప్పి ఎవర్నీ అంటే ఎవర్నీ ప్రేమించడానికి చాలా మంది ఇష్టపడరు. తమ మనసుకు నచ్చిన వారిని, తమను అర్థం చేసుకునే వారినే ప్రేమిస్తుంటారు. అయితే ఈ ఐదు రాశుల అమ్మాయిలతో లవ్ జర్నీ( Love Journey ) చేయడం కష్టమని పండితులు చెబుతున్నారు. ఏ క్షణంలో ఎలా మారుతారో అర్థం కాని పరిస్థితి వీరిది అని చెబుతున్నారు. కాబట్టి ఈ ఐదు రాశుల అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఆ ఐదు రాశులు ఏంటో తెలుసుకుందాం..
వృషభం (Taurus)
ఈ రాశి అమ్మాయిలను ప్రేమించాలంటే చాలా కష్టపడాలి. అంత ఈజీగా ప్రేమను అంగీకరించరు. ప్రేమ విషయంలో సుదీర్ఘంగా ఆలోచిస్తారు. కాబట్టి ప్రేమకు అంగీకారం తెలిపేందుకు అధిక సమయం తీసుకుంటున్నారు. ఈ రాశివారిని ప్రేమ విషయంలో బలవంతం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ రాశి అమ్మాయిలు అవకాశం దొరికితే చాలు ప్రేమికుడిని ద్వేషిస్తారు. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తిపై త్వరగా మోజు కోల్పోతారు.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి అమ్మాయిలు చాలా సీరియస్‌గా ఉంటారు. ప్రేమ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇతరులతో లవ్ జర్నీ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి.. చాలా జాగ్రత్తగా ప్రేమ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ప్రేమలో మోసపోయినా, లేదా ఆసక్తి లేని ప్రవర్తన చూసినా, వారు మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు.
తుల (Libra)
ఈ రాశి అమ్మాయిలు ప్రేమ విషయంలో మొండిగా ప్రవర్తిస్తారు. ఈ రాశి అమ్మాయిలకు నచ్చిన పనిని అబ్బాయిలు చేయాల్సిందే. వాళ్లు ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడాలని కోరుకుంటారు. ఇక ప్రియురాలి పట్ల ప్రేమానురాగాలు, ఆప్యాయత చూపించకపోతే.. ఏ మాత్రం ఆలోచించకుండా దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత అమ్మాయిలను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి అమ్మాయిలను ప్రేమించడం కష్టం. ప్రేమించినా వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ రాశి అమ్మాయిల నిర్ణయాలకు అడ్డు చెప్పకూడదు. వారు చెప్పినట్టు వినాల్సిందే. వీరు మొండిగా ఉంటారు కాబట్టి.. వారి నిర్ణయాలను విమర్శిస్తే, వారు మీతో కలిసి ఉండటానికి ఇష్టపడరు.
మీనా రాశి (Pisces)
మీనా రాశి అమ్మాయిలు నిజానికి ప్రేమ జీవితాన్ని ఇష్టపడరు. అసలు ప్రేమను వీరు నమ్మరు. అబ్బాయిల మాటలను అంత ఈజీగా నమ్మరు. వారి మాయలో పడిపోరు. ప్రేమను అంగీకరించడం చాలా కష్టం. ప్రేమకు ఈ రాశి అమ్మాయిలను ఒప్పించడం అంత సులువైన పనేం కాదు.