Zodiac Signs | సంక్రాంతి నాడు ‘లాభ దృష్టి రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
Zodiac Signs | ఈ సంక్రాంతి పండుగ ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి ఎంతో శుభప్రదమైనది. చాలా మంది సంక్రాంతి( Sankranthi )ని కీడు పండుగగా భావిస్తారు. కానీ సంక్రాంతి నాడు లాభ దృష్టి రాజయోగం( Labh Drishti Rajayogam ) ఏర్పడనుంది. దీంతో ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. మరి ఆ మూడు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు సంచారం చేయడం లేదా కలయిక కారణంగా కొన్ని సందర్భాల్లో రాజయోగాలు ఏర్పడుతాయి. ఆ మాదిరిగానే ఈ సంక్రాంతి( Sankranthi ) పండుగ సందర్భంగా జనవరి 13న మకర రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయనుంది. ఇక జనవరి 15న శని, శుక్ర గ్రహాలు.. 90 డిగ్రీల కోణంలో దగ్గరగా ఉంటాయి. ఈ క్రమంలో లాభ దృష్టి రాజయోగం( Labh Drishti Rajayogam ) ఏర్పడనుంది. దీంతో ఈ మూడు రాశుల( zodiac Signs ) వారికి అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారికి సంక్రాంతి పండుగ తర్వాత అన్ని మంచి రోజులే ప్రారంభం కాబోతున్నాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. లాభ దృష్టి రాజయోగం కారణంగా ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేసి, అద్భుతాలు సృష్టించబోతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగడంతో ఆదాయం అమాంతం పెరుగుతుంది. ఆటంకాలు కూడా తొలగిపోతాయి.
మిథున రాశి( Gemini )
లాభ దృష్టి రాజయోగం కారణంగా మిథున రాశి వారికి కూడా ఊహించని విధంగా లాభం చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇంట బయట సంతోషకర వాతావరణంలో గడుపుతారు. ఆదాయం పెరిగి.. విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు విజయాలు వరిస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి జనవరి 15 తర్వాత నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వీరు గత సంవత్సరంలో పడిన కష్టాల నుంచి విముక్తి పొందుతారు. కటుంబంలో శాంతియుత వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారు. మునపటి కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఇది మీకు మీ కుటుంబానికి ఆనందాన్ని కలుగజేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram