TTD News | తిరుమలకు వెళ్తున్నారా..? శ్రీవారి ఆలయంలో ఆగస్టులో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..!
TTD News | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక గమనిక వెల్లడించింది. తిరుమలలో ఆగస్టులో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. ఈ నెలలో గరుడ పంచమి వేడుకలు, పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివరాలను టీటీడీ ప్రకించింది.

ఆగస్టులో జరిగే ఉత్సవాల వివరాలు
4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.
7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.
10న కల్కి జయంతి.
13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి.
15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.
19న శ్రావణ పౌర్ణమి. పౌర్ణమి గరుడ సేవ. రాఖీ పండుగ. హయగ్రీవ జయంతి. విఖనస మహాముని జయంతి.
20న తిరుమల శ్రీవారు విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు. గాయత్రీ జపం.
27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.
28న శ్రీవారి శిక్యోత్సవం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram