Sun transits in Leo | చాలా రోజుల త‌ర్వాత సింహ రాశిలోకి సూర్యుడు..! ఇక‌ ఈ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!!

Sun transits in Leo | జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహం( Sun ) చాలా శక్తి వంతమైన గ్రహం. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశి( Leo )లోకి సంచారం చేశాడు. దీంతో ఓ నాలుగు రాశుల వారికి అదృష్టం కలిపొచ్చి ప‌ట్టింద‌ల్లా బంగారం కానుంది. మ‌రి ఆ రాశులేవో( Horoscope ) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Sun transits in Leo | చాలా రోజుల త‌ర్వాత సింహ రాశిలోకి సూర్యుడు..! ఇక‌ ఈ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!!

Sun transits in Leo | గ్ర‌హాలు( Planets ) ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూనే ఉంటాయి. ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్ర‌వేశిస్తూనే ఉంటాయి. ఇలా గ్ర‌హాలు మారిన‌ప్పుడ‌ల్లా.. ఆయా రాశుల వారి జాత‌క చ‌క్రాలు కూడా మారుతూనే ఉంటాయి. ఆ రాశుల( Horoscope ) వారి జీవితాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కొంద‌రి జీవితాల్లో వెలుగులు వ‌స్తాయి.. ఇంకొంద‌రి జీవితాల్లో చీక‌ట్లు అలుముకుంటాయి.

అయితే చాలా రోజుల త‌ర్వాత సింహ రాశి( Leo )లోకి సూర్యుడు( Sun ) ప్ర‌వేశిస్తున్న‌ట్లు జ్యోతిష్య‌త పండితులు చెబుతున్నారు. దీంతో ఓ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంద‌ని పండితులు పేర్కొంటున్నారు. ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అనుకున్న ప‌నుల‌న్నీ గ‌డువులోపే పూర్తవుతాయి.. దాంతో అనేక ర‌కాలుగా ల‌బ్ధి పొందుతార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి( Leo )

సింహ రాశిలోకి సూర్యుడి ప్ర‌వేశం వ‌ల్ల‌.. ఈ రాశి వారి జాత‌కం మార‌బోతుంది. వీరి జీవితం అద్భుతంగా ఉండ‌బోతుంది. ఈ రాశి వారు త‌ల‌పెట్టిన ప్ర‌తి ప‌ని స‌కాలంలో పూర్త‌వ‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కూడా క‌లిసి వ‌స్తుంద‌ట‌. ఊహించ‌ని రీతిలో ధ‌న‌లాభం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుక రావడంతో ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక సింహ రాశి వారికి ఇంటా బటయ సంతోషకర వాతావరణం ఉంటుంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

తులా రాశి( Libra )

ఈ రాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగారం కానుంద‌ట‌. ఈ రాశి వారు జీవితంలో ఎప్పుడూ ఊహించ‌ని మార్గాల ద్వారా ఆదాయం స‌మ‌కూరుతుంద‌ట‌. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొలగిపోయి.. కుటుంబ స‌భ్యులంతా సంతోషంగా గ‌డుపుతార‌ట‌. శుభ‌కార్యాలు కూడా నిర్వ‌హిస్తార‌ట‌. స‌మాజంలో గౌరవ మ‌ర్యాద‌లు ల‌భించ‌డంతో పాటు వీరికంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంటార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మిథున రాశి( Gemini )

ఈ రాశి వారికి సూర్యుడు తన సొంత రాశిలోకి సంచారం చేయడం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయ‌ట‌. వ్యాపారంలో అనేక లాభాలు గ‌డించి.. ఆర్థికంగా నిల‌దొక్కుకుంటార‌ట‌. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయ‌ట‌. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తార‌ట‌. మొత్తంగా సూర్యుడి ప్ర‌వేశంతో మిథున రాశి వారికి అన్ని విధాలా అద్భుతంగా ఉండ‌బోతుంద‌ని పండితుల చెబుతున్నారు.

ధనస్సు రాశి ( Sagittarius )

సింహ రాశిలోకి సూర్యుడి ప్ర‌వేశంతో.. ధ‌న‌స్సు రాశి వారికి అదృష్టం త‌లుపు త‌ట్టిన‌ట్టే అని పండితులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీరు క‌న్న క‌ల‌ల‌న్నీ నిజం అవుతాయ‌ట‌. స్థిరాస్తులు కొనుగోలు చేస్తార‌ట‌. విద్యార్థుల‌కు అద్భుత‌మైన స‌మ‌యం క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌. విద్యార్థులు, వ్యాపారస్తులకు, కళారంగంలో పని చేసే వారు చాలా బాగుంటుంద‌ట‌. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు పొందుతార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.