13.08.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వ్యాపారంలో లాభాల పంట‌..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

13.08.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వ్యాపారంలో లాభాల పంట‌..!

మేషం

అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. పనులు ఆలస్యమయినా మంచి ఫలితాలే ఉంటాయి. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. గర్వం పనికిరాదు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో గణనీయమైన లాభాలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృషభం

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడతారు. వారిపట్ల చూసీ చూడనట్లు ఉంటే మంచిది. వ్యాపారంలో భారీనష్ట సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి.

మిథునం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలున్నాయి. చిత్తశుద్ధితో పని చేయడం అవసరం. ముఖ్యమైన విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది.

కర్కాటకం

ఈ రోజు శుభప్రదమైన రోజు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా గొప్ప శుభ సమయం. పూర్వీకుల ఆస్తి కలిసి రావచ్చు. దైవబలంతో శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో పేరొందిన వ్యక్తులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

సింహం

కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి. ఉద్యోగంలో చాలా ఒత్తిళ్లు ఉంటాయి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. ఎక్కువ సమయం పనిలోనే గడుపుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. ఆర్ధిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

తుల

ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లో అనిశ్చితి చోటు చేసుకుంటుంది. ఆర్ధిక విషయాల్లో గందరగోళం నెలకొంటుంది. సహనం కలిగి ఉండాలి. భవిష్యత్ పట్ల సానుకూల దృక్పధంతో ఉంటే మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధువుల నుంచి అందిన శుభవార్తలతో ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. ప్రయాణం ఆనంద దాయకంగా ఉంటాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి బాట పడతారు. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉండవచ్చు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. స్థిరాస్తుల ద్వారా సంపద పెరుగుతుంది.

కుంభం

వృత్తి ఉద్యోగాలలో అద్భుతంగా రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏ పనులు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశకు లోనవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతారు. వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు రావడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకుంటే కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు.