9 జూన్ నుంచి 15వ‌ తేదీ వ‌ర‌కు.. ఈ వారం మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 9, 2024 / 06:27 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాల వలన మంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులకు ఈ వారం ఖచ్చితంగా మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో అందరిని ఒకతాటిపైకి తీసుకువస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు తెలియడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి చేసే పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు పని ప్రదేశంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు ఆర్ధిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ నష్టాలను చవి చూస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు, విలాసాల కోసం డబ్బు అధికంగా ఖర్చవుతుంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపార రంగాల వారికి పనిలో పురోగతి, ఆర్ధిక వృద్ధి ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు లభిస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కొంతకాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు విపరీతమైన లాభాలను పొందుతారు. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశాల్లో వృత్తిని కొనసాగించాలని ప్రయత్నించే వారు విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థులు ఈ వారంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం ఉంటాయి.

సింహం

సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికవృద్ధి ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. కోరుకున్న ప్రమోషన్ లేదా బదిలీకి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిపరంగా, వాణిజ్యపరంగా ఎదగడానికి నూతన అవకాశాలు అందుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కన్య

కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అదృష్ట యోగం, లక్ష్మీకటాక్షం ఉంటాయి. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. గౌరవం, కీర్తి పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని సవాళ్లు ఎదురవుంటాయి. మీ ప్రతిభతో సవాళ్ళను అధిగమిస్తారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

తుల

తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన మేరకు ప్రయోజనాలు ఉండకపోవచ్చు. సన్నిహితులు, స్నేహితుల సహకారంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా మారుతాయి. అధిక ధనవ్యయం అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోకుంటే కలహాలు తప్పవు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది.అన్ని రంగాల వారికి ఈ వారం సంపూర్ణ సౌభాగ్యం కలుగుతుంది. జీవితంలోని సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఎలాంటి సమస్యలనైనా చిటికెలో పరిష్కరిస్తారు. పోటీ పరీక్షల కోసం చదువుతున్న వారికి అత్యంత అదృష్ట యోగం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో గణనీయమైన విజయం ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, అవివాహితులకు కల్యాణ యోగం ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి విజయసిద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ప్రభుత్వపరంగా రావలసిన బకాయిలు అందుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. లక్ష్య సాధనకు సన్నిహితులు, కుటుంబ సభ్యుల సహకారం ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. తీరిక లేని పనులతో విశ్రాంతి లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారులకు సంస్థ ఎదుగుదల కోసం కన్న కలలు నిజమవుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా విహారయాత్రలకు వెళతారు. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను తెస్తాయి. జీవితభాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ వారం ప్రభావవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారు పనులన్నీ సకాలంలో పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. క్రమశిక్షణతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వరంగంలో ఉన్న అధికారులు కీలకమైన బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగుల కల ఫలించి మంచి జీతంతో ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారవేత్తలకు ఆదాయాల పరంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. అనేక ఆర్థిక లాభాలను పొందవచ్చు. సంతానం అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మీనం

మీన రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. విపరీతమైన లాభాలను అందుకుంటారు. వృత్తి నిపుణులు, రచయితలు గొప్ప విజయాన్ని అందుకోనున్నారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గతంలో ఏర్పడిన అపార్ధాలు తొలగిపోతాయి. మీడియా రంగాలలో పని చేసే వారికి ఈ వారం అదృష్టయోగం పడుతుంది. కోర్టు వ్యవహారాలలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.

Latest News