Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పెద్ద మొత్తంలో ధనలాభం..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరగవచ్చు. కృషి, పట్టుదలతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేయడానికి, నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు అవగాహనతో తొలగుతాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రతిభను చాటుకోవడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో మీ పరపతితో పెట్టుబడులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు సమర్ధవంతంగా వినియోగించుకుంటే ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు. ప్రేమ సంబంధాల్లో అహంభావాన్ని పక్కన పెడితే బంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించి, విజయపథంలో దూసుకుపోతారు. ఈ పరిణామం మీకు మానసిక సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు ఆర్థిక లాభాలు కూడా ఉండటం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. కానీ కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రేమ వ్యవహారాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల బంధాలు బలపడతాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో స్నేహసంబంధాలు బలపడతాయి. అందరి సహకారంతో సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రేమ బంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. విద్యార్థులు ఆశించిన విజయాల కోసం కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పురోగతి ఆనందం కలిగిస్తుంది. మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. లాభాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబ పెద్దల మాటకు విలువ ఇవ్వడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాల్లో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగ పడతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు పెరుగుతాయి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు, ఘర్షణలు ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ముందస్తు ప్రణాళిక లోపంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడుతాయి. వ్యాపారులు మార్కెట్ అవగాహనతో పెట్టే పెట్టుబడులు లాభాలు తెచ్చి పెడతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధికంగా ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పెద్ద మొత్తంలో ధనలాభం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం సహకరిస్తోంది. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే విజయం సిద్ధిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరమైన పురోగతి గోచరిస్తోంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం, అధికారుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. నిరంతర కృషితో పదోన్నతులు అందుకుంటారు. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారులకు అనువైన సమయం. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. రుణభారం తొలగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. శుక్రగ్రహ యోగంతో ఐశ్వర్యవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. ఉద్యోగంలో విజయపథంలో దూసుకెళ్తారు. వ్యాపారంలో మంచి యోగం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు వ్యాపార విస్తరణకు ఉపయోగ పడతాయి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ రంగాల వారికి ఈ వారం అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా కొనసాగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఎంత శ్రమ పడితే అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. ఉద్యోగ వేటలో ఉన్నవారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. విదేశీయానంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. సరైన ప్రణాళిక విజయానికి మార్గం చూపుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ బంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో ఏర్పడే వివాదాలు అవగాహనతో సర్దుకుంటాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. సమయపాలనతో ఒత్తిడి అధిగమించవచ్చు. వ్యాపారంలో ధనయోగాలున్నాయి. నూతన వ్యూహాలు అనుసరించడం ద్వారా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వృథా ఖర్చులు నివారించండి. ప్రేమ విషయంలో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. బంధుమిత్రుల్లో కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది. అవమానకర సంఘటనలకు దూరంగా ఉండడం మంచిది. మొహమాటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. స్థానచలనం ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు పొందుతారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా ఈ వారం అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. కొత్త అవకాశాలకు ఇది సరైన సమయం. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు అందుకుంటారు. ఆర్థికంగా స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఓర్పుతో వేచి చూడడం అవసరం. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram